మొదలైన సముద్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో బాధావత్ కిషన్ నిర్మిస్తోన్న ‘సముద్రుడు’ చిత్రం బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో మొదలయ్యింది. చిత్రానికి దర్శకుడు రమేష్‌వర్మ క్లాప్‌నిచ్చారు. గౌరవ దర్శకత్వం సముద్ర వహించగా, ముత్యాల రామదాసు కెమెరా స్విచ్చాన్ చేశారు. మల్టీ డైమెన్షనల్ వాసు పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నగేష్ నారదాశి మాట్లాడుతూ -పూర్తిగా మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో మాస్‌కి కనెక్టయ్యే కమర్షియల్‌గా తెరకెక్కనున్న సినిమా -సముద్రుడు.
వేటకెళ్లే టైంలో ప్రాణాలతో చెలగాటమాడే జాలర్ల జీవితాలకు అనుకోని అదృష్టం కలసి వస్తోన్న సమయంలో -వారిని ఏ విధమైన ఆపద చుట్టుముట్టింది. ఆ సమస్యను హీరో గంగరాజు ఎలా పరిష్కరించాడు అన్న పాయింట్‌ని యాక్షన్ సన్నివేశాలతో చెబుతున్నాం. మంచి కంటెంట్‌వున్న చిత్రానికి నిర్మాతలు సహకారం పూర్తిగా ఉంది అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ -నేను ఇదివరకే నగేష్ డైరెక్షన్‌లో శ్రీ సత్యన్నారాయణ వ్రతం సినిమాలో 5 పాత్రలు చేశాను. తను చాలా ప్లానింగ్‌వున్న దర్శకుడు. అందుకే మళ్లీ ఓకే చేసి, పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నా. హీరో రమాకాంత్ స్టోరీకి యాప్ట్ అన్నారు. హీరో రమాకాంత్ మాట్లాడుతూ -స్క్రిప్ట్ బాగా నచ్చి ఓకే చెప్పాను. సీనియర్ ఆర్టిస్టులు చాలామంది సినిమాలో చేస్తున్నారన్నారు. హీరోయిన్లు మోనాల్, సిమర్‌లు మాట్లాడారు.