టు బీ ఫ్రాంక్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరోల్లో అడవి శేష్‌ది సెపరేట్ ట్రాక్. అతని గురించి చెప్పడంకంటే -‘క్షణం’
‘గూఢచారి’.. థ్రిల్లర్, యాక్షన్ డ్రామాలు చూడమని సజెస్ట్ చేయాలి. సెలెక్టెడ్ కథలు.. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్.. రెంటితో తనదైన ఇమేజ్ తెచ్చుకున్నాడు హీరో శేష్. అతని తాజా థ్రిల్లర్ -ఎవరు?. సినిమా ప్రమోషన్స్‌తో బిజీగావున్న శేష్,
థియేటర్లకు వస్తోన్న -ఎవరు? గురించి మీడియాతో ముచ్చటించాడు.
నేను యూఎస్ రిటర్న్ కనుక రిచ్ కిడ్ అన్న
ఒపీనియన్ చాలామందిలో ఉంది. నిజానికి మాదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కష్టంతో మిగుల్చుకున్న కొద్దిపాటి సొమ్మును ‘కిస్’కి పెట్టేశాను. ఆ సినిమాతో పోస్టర్లకు వాడే మైదా ఖర్చూ రాలేదు. చేతులు కాల్చుకోవడంలో కాస్ట్లీ లెసెన్ అది. సో, డైరెక్టర్‌గా ఫెయిల్. మళ్లీ అలాంటి ప్రయత్నాలను మైండ్‌లోకి రానివ్వకుండా ఆర్టిస్ట్‌గా,
స్క్రీన్‌ప్లే రైటర్‌గా సెటిలైపోయా.

మళ్లీ ఇలా..
నాకంటూ ఓ ఇమేజ్‌నిచ్చిన సినిమా -క్షణం. అదో థ్రిల్లర్. తర్వాత ‘అమీ తుమీ’ అంటూ రొమాంటిక్ కామెడీ చేశా. తరువాత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ డ్రామా ‘గూఢచారి’ మంచి పేరు తెచ్చింది. అందుకే -మళ్లీ కంప్లీట్ థ్రిల్లర్‌పై ఫోకస్ చేశా. ఎవరు? చూస్తే అర్థమైపోద్ది.
కథే ట్విస్ట్..
కాస్టింగ్ కంటే కథే ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. గూఢచారి క్లైమాక్స్‌లో జగపతిబాబు పాత్ర ఓ ట్విస్ట్. కాని, ఈ కథలో కథే ఓ ట్విస్ట్.
టీంకి లెసన్..?
ఆసక్తికొద్దీ ‘క్షణం’ కొందరికీ చూపిస్తే -పెదవి విరిచారు. దర్శక నిర్మాతకే కాదు, నాకూ ఓ షాక్. కట్‌చేస్తే -ఆడియన్స్ హిట్ చేశారు. ఇక్కడే మాకు -సినిమా ఎవరికి చూపించాలి, ఎవరి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నది అర్థమైంది.
ఊహలొద్దు..
ఎవరు? అన్న టైటిల్‌తో కథ విషయంలో ఓ జస్ట్ఫికేషన్‌కు వచ్చేయొద్దు. చాలామంది ఊహిస్తున్నట్టు -నేరం చేసిందెవరు? అని చెప్పే కథ కాదు. నేరమేంటి? చేసిందెవరు? విక్టిమ్ ఎవరు? అన్న మూలాల మీద కథ నడుస్తుంది. సినిమా థ్రిల్ చేయడం ఖాయం.
బిగ్గెస్ట్ క్రిటిక్ వాడు..
సినిమా చూసిన వెనె్నల కిషోర్ -మాట్లాడకుండా ఓ హగ్ ఇచ్చాడు. ఆఫ్ స్క్రీన్‌లో సీరియస్‌గావుండే కిషోర్‌కి -సినిమాపై మంచి నాలెడ్జి ఉంది. అందుకే -వాడు నా బెస్ట్ క్రిటిక్. వాడి ఫీడ్ బ్యాక్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తా.
పోలికలెందుకు..?
ఎవరు?ని బద్లాతో పోలుస్తున్నారు. ఇంకొన్ని గంటల్లో ఎలాగూ సినిమా చూస్తారు. ఔనో, కాదో పోల్చేవాళ్లే చెప్పాలి.
వ్వాట్ నెక్స్ట్..?
నెక్స్ట్ ప్రాజెక్టు -మేజర్. అక్టోబర్‌లో మొదలవుతుంది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ అది. ఓ గొప్ప వ్యక్తి లైఫ్‌ని చూస్తాం. ఆ సినిమాలో మహేష్‌బాబుతో కొలాబ్రేట్ అవ్వడం గ్రేట్ అచీవ్‌మెంట్. ‘గూఢచారి 2’ మొదలెట్టే ఆలోచన ఉంది.

-‘వి’