ఉత్కంఠగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైరా నరసింహారెడ్డి సినిమా మేకింగ్ వీడియో విడుదలైంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందుగా మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. సైరా సెట్స్‌లో చిత్ర నిర్మాణానికి ఎలా కష్టపడ్డారన్న విషయాన్ని చూపిస్తూ -ఉత్కంఠగా మేకింగ్ వీడియోను డిజైన్ చేశారు. సీనియర్ హీరో చిరంజీవి నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం -సైరా. తొలితరం స్వాతంత్రోద్యమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథగా కొణిదెల ప్రొడక్షన్స్‌పై దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం. రామ్‌చరణ్ నిర్మాత. మేకింగ్ వీడియోలో అమితాబ్, విజయ్ సేతుపతి, నయనరాత, తమన్నా, జగపతిబాబు, సుదీప్, రవికిషన్, నిహారిక పాత్రల లైవ్‌ను చూపించటం బావుంది. ఇటీవలే చిత్రీకరణ ముగియటంతో -శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుతున్నారు. అక్టోబర్ 2, గాంధీజయంతి రోజున సినిమా థియేటర్లకు రానుంది.