సెంటిమెంట్ వర్కౌటవుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాస్ హీరోగా యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన చిత్రం -సాహో. ప్రభాస్‌తో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకఫూర్ జోడీకట్టింది. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఆగస్టు 30న తెలుగు, తమిళం, హిందీలో థియేటర్లకు రానుంది. ఈలోగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ప్రీరిలీజ్ వేడుకను -సెంటిమెంట్ ప్లేస్‌లో నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేసిందట. భారీ బడ్జెట్‌తో జక్కన్న చెక్కిన బాహుబలి ప్రీరిలీజ్ వేడుక నిర్వహించిన రామోజీ ఫిల్మ్ సిటీలోనే -సాహో ప్రీరిలీజ్‌కూ సన్నాహాలు చేశారని సమాచారం. బాహుబలి హిట్టు కొట్టింది కనుక, అదే ప్లేస్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహిస్తే కలిసొస్తుందని చిత్రబృందం సెంటిమెంట్ ఫీలవుతోంది. సాయంత్రం సమయంలో జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్‌కు -సినిమా ప్రముఖులు భారీగా హాజరవుతారని అంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా సాగడంతో -సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. డైహార్డ్ ఫ్యాన్స్ ఆగస్టు 30కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.