దుమ్మురేపిన రంగస్థలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్‌లో సైమా వేదికపై ‘రంగస్థలం’ దుమ్మురేపింది. రామ్‌చరణ్, సమంత జోడీగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రానికి తొమ్మిది సైమా అవార్డులు దక్కాయి. తరువాతి స్థానాల్లో మహానటి, ఆర్‌ఎస్ 100 చిత్రాలు చెరి మూడు అవార్డులు సొంతం చేసుకున్నాయి. దుబాయ్‌లో శుక్రవారం అత్యంత వైభవంగా సైమా అవార్డుల ప్రదానోత్సవం సాగింది. ఉత్తమ చిత్రంగా మహానటి, ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, ఉత్తమ నటిగా కీర్తిసురేష్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు సొంతం చేసుకున్నారు. చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు ఆటపాటలతో అలరించారు. రంగస్థలం చిత్రానికి సంబంధించి ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, విమర్శకుల ప్రశంసలందుకున్న నటిగా సమంత, ఉత్తమ సహాయనటిగా అనసూయ, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీ శ్రీప్రసాద్, ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ , ఉత్తమ గాయనిగా ఎంఎం మానసి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు, ఉత్తమ కళా దర్శకుడిగా రామకృష్ణకు అవార్డులు దక్కించుకున్నారు. మహానటి చిత్రానికిగాను ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి కీర్తిసురేష్, ఉత్తమ సహాయ నటుడు రాజేంద్రప్రసాద్‌కు అవార్డులు లభించాయి. ఆర్‌ఎక్స్ 100 చిత్రానిగాను ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా అజయ్ భూపతి, తొలి చిత్ర నటిగా పాయల్ రాజ్‌పుత్, ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి అవార్డులు సాధించారు. విమర్శకుల ప్రశంసలందుకున్న నటుడిగాను, సామాజిక మాధ్యమాల్లో పాపులర్ స్టార్‌గాను విజయ్ దేవరకొండ (గీత గోవిందం) రెండు అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఉత్తమ హాస్య నటుడిగా సత్య (్ఛలో), ఉత్తమ విలన్‌గా శరత్‌కుమార్ (నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా), ఉత్తమ తొలి చిత్ర నటుడిగా కల్యాణ్ దేవ్ (విజేత) అవార్డులు సాధించారు.