యువత ఎలా ఉందంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై సాక్షీ చౌదరి ప్రధాన పాత్రలో శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి. ఎస్. సాయి కృష్ణారెడ్డి రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తిచేశారు. పర్వీన్‌రాజ్, పూజిత జంటగా నటిస్తున్న ఈ చిత్రం గూర్చి దర్శకుడు మాట్లాడుతూ, తొలి షెడ్యూల్‌ను పూర్తిచేశామని, ఇందులో పర్వీన్‌రాజ్, పూజితలపై అందమైన లొకేషన్లలో పాటల చిత్రీకరణ జరిపామని, ఈనెలాఖరుతో ఈ షూటింగ్ పూర్తిచేస్తామని, తరువాత షెడ్యూల్‌ను మే మొదటివారంలో ప్రారంభించి నెలాఖరుకు పూర్తిచేస్తామని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో యువత ఎలా వుంది అన్న అంశంపై యువ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్రీకరిస్తున్నామని అన్నారు. సాక్షీ చౌదరి పాత్ర హైలెట్‌గా నిలిచే ఈ చిత్రం అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నామని, త్వరలో సినిమా షూటింగ్‌ను పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలకు వెళతామని నిర్మాత సాయి కృష్ణారెడ్డి అన్నారు.
పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాకేష్, సంతోష్, ఇంద్ర, అవంతిక, అక్షర, శ్రావణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్:నందమూరి హరి, సంగీతం:కిషన్ కవాడియా, కెమెరా:కె.శంకరరావు, నిర్మాత:ఎం.వి.ఎస్.కృష్ణారెడ్డి, రచన, దర్శకత్వం:శేషసాయి మరిప్రోలు.