ఏమో.. ఏదైనా జరగొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ రాజాను హీరోగా పరిచయం చేస్తూ, పూజా సోలంకి, సాషాసింగ్ హీరోయిన్లుగా దర్శకుడు కె రమాకాంత్ తెరకెక్కించిన చిత్రం -ఏదైనా జరగొచ్చు. వెట్‌బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సుధర్మ్ ప్రొడక్షన్స్‌పై సుదర్శన్ హనగోడు నిర్మించారు. తమిళస్టార్ బాబి సింహా నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ఆగస్టు 23న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. నటుడు శివాజీరాజా మాట్లాడుతూ -ఈ సీజన్‌లో కంటెంట్‌వున్న సినిమాలకు డిమాండ్ పెరిగింది. అవే సక్సెస్ సాధిస్తున్నాయి కూడా. అందుకు ఏమాత్రం తగ్గని సినిమా ఇది. ఈ సినిమాకు దర్శకుడు రమాకాంత్ ప్రాణం. మ్యూజిక్ బాగుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి సినిమా మంచి పేరు తేవాలి అని ఆకాంక్షించారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్ పెండ్యాల మాట్లాడుతూ -ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నా. నాలుగేళ్ల క్రితం మొదలైన ప్రాజెక్టు ఇది. అన్ని పాటలు అప్పుడే కంపోజ్ చేశా. ఆర్‌ఆర్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తుందనే భావిస్తున్నా అన్నారు. నటుడు బాబీసింహ మాట్లాడుతూ -ఈ కథ, అందుకు తగిన సన్నివేశాలు.. వాటిని కనెక్ట్ చేసిన విధానం.. ఇదంతా ఇప్పటికీ నాకు సర్‌ప్రైజింగే. మంచి రిజల్ట్ ఉంటుందని నమ్ముతున్నా. టీమ్‌కి ఆల్ ది బెస్ట్ అన్నారు. దర్శకుడు కె రమాకాంత్ మాట్లాడుతూ -ఇది డార్క్ కామెడీ హారర్ థ్రిల్లర్. తెలుగు స్క్రీన్‌మీద చూడబోయే సరికొత్త లవ్ స్టోరీ. జాషువా మాస్టర్ యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్. బాబీసింహ, అజయ్ ఘోష్ పాత్రలు అద్భుతం అన్నారు. హీరో విజయ్‌రాజా మాట్లాడుతూ -జిగర్తాండలో బాబీసింహ నటన చూసి ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నా. మొదటి సినిమాకే ఆ చాన్స్ రావడం నా అదృష్టం. సినిమా అందరికీ కనెక్టవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.