స్లిమ్.. నమిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనని తను పూర్తిగా మార్చేసుకుంది నమిత. అనూహ్యంగా జీరో సైజ్‌కి వచ్చేసి -కోలీవుడ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేందుకు సిద్ధమైంది. పదిహేనేళ్ళ క్రితం టాలీవుడ్‌లోకి పంజాబీ బ్యూటీగా అడుగుపెట్టిన నమిత -రెండేళ్లు తిరక్కుండానే విజయ్‌కాంత్‌తో ‘ఎంగల్ అన్నా’ చిత్రంతో కోలీవుడ్‌లోనూ స్థానం సంపాదించింది. ‘మచ్చాన్’ అన్న ముద్దుపేరుతో బొద్దుగుమ్మ మంచి ఇమేజ్‌నే తెచ్చుకుంది. విజయ్‌తో ‘అళగియ తమిళ్ మగన్’, అజిత్‌తో ‘బిల్లా’ చిత్రాల్లో ఆమె చేసిన పాత్రలు -ఆమెను హాట్ డ్రీమ్‌గాళ్‌గా మార్చశాయి. ఫిజిక్ మెయింటెనెన్స్‌లో అదుపుతప్పిన నమితకు -ఆ తరువాత అవకాశాలు లేకుండాపోయాయి. తన ఫిజిక్కే తనకు అట్రాక్షన్ అంటూ అప్పట్లో స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చింది నిమిత. కొత్త హీరోయిన్ల తాకిడి, ఆమెకు తగిన పాత్రలు దొరక్కపోవడంతో క్రమంగా స్క్రీన్‌కు దూరమై బుల్లితెరపైనా తన ప్రయత్నాలు చేసింది. వివాహం తరువాత వేషాలకు దూరంగా ఉంటూ వచ్చిన నమిత -ఇప్పుడు కోలీవుడ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌కు తనను తను మార్చుకుని కొత్త మేకోవర్‌తో రాబోతోంది. భారీ కసరత్తులతో భారీ ఆకృతిని స్లిమ్‌కు తీసుకొచ్చిన నమిత -నాజూకు ఆకృతిని సోషల్ మీడియాలో అప్‌డేట్స్‌గా పెడుతోంది. ఏమో, కాలం కలిసొస్తే మళ్లీ విజృంభిస్తుందేమో చూడాలి.