ఇబ్బందులు పడ్డాకే దర్శకుడినయ్యాను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అంటేనే పోటీ పరిశ్రమ. ఇక్కడ నిలబడటానికి కఠోర పరిశ్రమ తప్పదు. ఆ కోణంలో -కొత్తవాళ్లకు ఎదురయ్యే ఇబ్బందులే దర్శకుడిగా నేనూ ఎదుర్కొన్నా. నన్ను నేను ప్రూవ్ చేసుకోడానికి హీరో బేస్డ్ సినిమాతో కాకుండా -్ఫక్షనల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకెళ్తున్నా’ అంటున్నాడు డెబ్యూ డైరెక్టర్ కె రమాకాంత్. బాబీసింహా, విజయ్ రాజా పూజాసోలంకి, సాహా సింగ్ ముఖ్య పాత్రలుగా వెట్‌బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సుధర్మ ప్రొడక్షన్స్‌పై సుదర్శన్ హనుగోడు నిర్మించిన సినిమా -ఏదైనా జరగొచ్చు. ఫిక్షనల్ మూవీగా దర్శకుడు కె రమాకాంత్ తెరకెక్కించాడు. శుక్రవారం సినిమా విడుదలవుతోన్న సందర్భంలో దర్శకుడు రమాకాంత్ మీడియాతో ముచ్చటించాడు.
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దగ్గర వర్క్ చేశాను. తరువాత ఫిల్మ్ మేకింగ్ స్టడీ కోసం ఫ్రాన్స్ వెళ్లా. దర్శకుడిగా తొలి సినిమా చేస్తున్నా.
ఒక ప్రొటగానిస్ట్.. ఇద్దరు ప్యాడప్ ఆర్టిస్టులు.. స్లాప్ స్టిక్ కామెడీ -ఆ ప్యాట్రన్‌కు విరుద్ధమైన సినిమా ఇది. హీరోలు ముగ్గురికీ సమాన పాత్ర, ప్రాధాన్యత ఉంటుంది.
కొత్త దర్శకుడిని కనుక -హీరో బేస్డ్ సినిమాకు వెళ్తే నాకు స్వేచ్ఛ దొరకడం కష్టంకావొచ్చని నా అభిప్రాయం. కొత్తవాళ్లతో వెళ్తే -వత్తిళ్లకు దూరంగా నా పరిధిలో నేను సినిమా చేయొచ్చు. అందుకే..
ఏప్రిల్ 1న పుట్టిన ముగ్గురు కుర్రాళ్లు -పిచ్చి పనులతో తెలీకుండా క్రైసిస్‌లో పడతారు. ఆ పరిస్థితినుంచి బయటపడి వాళ్లను వాళ్లెలా ప్రూవ్ చేసుకున్నారన్నదే మూల కథ. ఇదో డార్క్ కామెడీ స్టోరీ.
అనుసరణతోనో, అనుకరణతోనో రాసుకున్న కథ కాదు. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయాలన్న కానె్సప్ట్‌తో నాకు నేను రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ. ఫిల్మ్ మేకర్‌గా సుదీర్ఘకాలం జర్నీ చేయాలంటే నాకంటూ ఒరిజినాలిటీ ఉండాలి. అందుకే -అనుకరణ, అనుసరణకు నేను దూరం.
అందరు కొత్తవాళ్ల మధ్య -బాబీ సింహాను తీసుకోడానికి కారణం ఉంది. కథలో బాగంగా ఇంటెన్స్ రా లవ్ స్టోరీ నడుస్తుంది. ఆ పాత్రను అతను అయితేనే సరిపోతాడని నెరేట్ చేశా. వెంటనే ఒప్పుకున్నారు.
సీనియర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా కొడుకుని తీసుకోడానికి ప్రత్యేక కారణాలు లేవు. నేను ఆడియన్స్ చేసిన తరువాతే ఎంపిక తీసుకున్నా. ఇక వెనె్నల కిషోర్ -కరుడుగట్టిన పిచ్చి దర్శకుడిగా ఎంటర్‌టైన్ చేస్తాడు.
సినిమాలో రిపీట్ లొకేషన్ అన్నది ఉండదు. అయినా -మొత్తం హైదరాబాద్ పరిధిలోనే పూర్తి చేశాం.
కొత్త ప్రాజెక్టుల విషయం -సినిమా విడుదలయ్యాకే ఆలోచిస్తా. హీరో, హీరోయిన్ బేస్డ్ కథలు రాసుకున్నా. యాక్షన్ సినిమాలు చేయాలన్న ఆలోచన ఉంది.