నిర్మాతలకు శేష్’ గేమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టన్నుల కొద్దీ సినిమాలొస్తున్నా -బాక్సాఫీస్ దగ్గర ఓకే అనిపించుకుంటున్నవి పదో పరకో. ఏడాదికేడాది ఈ గ్రాఫ్ మరీ దిగజారుతోంది. ఇది టాలీవుడ్‌లో కనిపిస్తోన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏ హీరోతో సినిమా తీస్తే -మినిమం గ్యారెంటీ ఉంటుందన్న లెక్కలు నిర్మాతలు వేసుకోవడం సహజం. స్టార్ హీరోల్ని పక్కన పెడితే -మీడియం రేజ్ కథను సిద్ధం చేసుకున్న దర్శకులూ.. వాళ్లను మరోమెట్టుపై నిలబెట్టే హీరో కోసం వెతకడం మరీ సహజం. సో, మొత్తంగా సేఫ్ గేమ్ ఆడటానికి ప్రస్తుతం శేష్ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఇదీ ఎవరు? కొట్టిన హిట్టు తరువాత టాలీవుడ్ టాక్. ఒక క్షణం. తరువాత గూఢచారి. తాజాగా ఎవరు? వీటిని కేవలం హిట్టు సినిమాల కిందే చూడలేం. ఓ తరహా జోనర్‌లో వస్తోన్న వైవిధ్యమైన కథా చిత్రాలుగానూ చూడాలి. అవి స్ట్రెయిట్ సినిమాలా? రీమేక్‌లా? అన్న చర్చను పక్కనపెడితే -మినిమం గ్యారెంటీ చిత్రాలుగానే చూస్తున్నారు మేకర్స్. ఇటీవల వచ్చిన ఎవరు? కథ వెనుక ఎందరి కసరత్తులున్నా -క్రేజ్ మాత్రం పూర్తిగా శేష్ అకౌంట్‌కే క్రెడిట్ అయ్యింది. సో, నిర్మాతల దృష్టిలో ఇప్పుడు శేష్ మినిమం గ్యారెంటీ హీరో. ఒకప్పుడు రవితేజ.. ఆ తరువాత నాని.. నడుస్తున్న సీజన్‌లో అడివి శేష్. ఒకప్పుడు రవితేజ -ఒక కోణంలో కల్పతరువయ్యాడు. పెర్ఫార్మెన్స్‌తో నాని ఆ ప్లేస్ అందుకున్నాడు. శేష్ మాత్రం -మరోకోణంలో ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. బడ్జెట్ విషయంలో హీరోగా తీసుకునే కేర్, పనికిరాని ప్రయోగాలను నియంత్రించటం, ప్రీప్రొడక్షన్స్‌లోనే కథబలాన్ని అంచనా వేయటంలాంటి ఎక్స్‌ట్రా టాలెంట్స్ -అతన్ని మినిమం గ్యారెంటీ హీరో లెవెల్‌కు తీసుకొచ్చాయని చెప్పాలి. శేష్ సినిమా అనేసరికి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సైతం సంతృప్తికరంగా ముందుకు వస్తుండటం కూడా అతనికి కలిసొచ్చే అంశంగానే కనిపిస్తోంది. ఎదురు దెబ్బలు తిన్న తరువాత వస్తోన్న అవకాశం కనుక -శేష్ సైతం తన మార్కెట్ విస్తరణకు మంచి ప్రణాళికలే సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మాటల్లో కాకుండా చేతల్లో ‘క్వాలిటీ.. క్వాంటికీ’ సూత్రాన్ని అనుసరిస్తున్న శేష్ -తరువాతి ప్రాజెక్టు ‘మేజర్’లోనూ ఆ స్టామినా చూపిస్తే ఓ రేంజ్‌కు వెళ్లిపోవడం ఖాయం.