సూపర్ రన్.. కౌసల్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐశ్వర్య రాజేష్, రాజేంద్రప్రసాద్, కార్తీక్‌రాజు, వెనె్నల కిషోర్ ముఖ్య పాత్రల్లో కెఎస్ రామారావు సమర్పకుడిగా కెఎ వల్లభ నిర్మించిన చిత్రం -కౌసల్య కృష్ణమూర్తి. శివ కార్తికేయన్ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా 23న విడుదలై మంచి టాక్‌తో నడుస్తోంది. దీంతో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రబృందం. కార్యక్రమంలో కెఎస్ రామారావు మాట్లాడుతూ -కౌసల్యకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. దర్శకుడు భీమనేని, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, రాజేంద్రప్రసాద్, కార్తీక్‌రాజులకు అభినందనలు. సినిమాకు ప్రశంసలొచ్చినా, కమర్షియల్ విజయమూ అవసరం. చిన్న బడ్జెట్, సమాజానికి ఉపయోగపడే సినిమాలకు అందరి ప్రోత్సాహం కావాలి. ఇకపై క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై పర్పస్‌వున్న సినిమాలు వస్తాయి అన్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ -తెలుగులో సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి చిత్రాలను సపోర్ట్ చేస్తే, నాలాంటి ఆర్టిస్టులు వైవిధ్యమైన చిత్రాలకు ధైర్యం చేస్తారు. చాలాకాలం తరువాత మంచి సినిమా చూశామన్న భావనను ఆడియన్స్ వ్యక్తం చేస్తుండటం హ్యాపీగా ఉంది అన్నారు. దర్శకుడు భీమనేని మాట్లాడుతూ -ఏ సినిమాకైనా ఫౌండేషన్ కథ. మంచి కథను ఎంపిక చేసుకోవడంతోనే సగం విజయం సాధించాం. ‘సుడిగాడు’ తరువాత ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండటం నాకు హ్యాపీగా ఉంది. మంచి చిత్రాలకు ఆడియనే్న పబ్లిసిటీ ఇస్తారని కౌసల్య ప్రూవ్ చేస్తోంది. మంచి కథనిచ్చిన అరుణ్‌రాజా, హీరో శివకార్తికేయన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా నా కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ అన్నారు.