అ.. ఆ.. షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, సమంత జంటగా హారిక అం డ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో రాధాకృష్ణ రూపొందిస్తున్న ‘అ.. ఆ’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ను నిన్న సాయంత్రం పూర్తిచేశారు. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేస్తున్నారని నితిన్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలిపారు. షూటింగ్ పూర్తయ్యాక మంచి స్నేహపూరిత వాతావరణంలో ఉన్న టీమ్‌ను తాను మిస్సయ్యానని తెలుపుతూ చివరిగా అడిగిన టీమ్ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. ఈ వేసవికే విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే వున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఈనెల 26న విడుదల కానుంది.