త్వరలో శ్రీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో సాయిదీప్ చాట్ల, బాలురెడ్డి, షేక్ షిరాజ్ రూపొందిస్తున్న చిత్రం శ్రీశ్రీ. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, హీరో కృష్ణ స్వర్ణోత్సవ చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలైందని, మంచి ఆదరణ పొందుతోందని తెలిపారు. ఫస్ట్ కాపీ సిద్ధమైన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, మహేష్‌బాబు వాయిస్ ఓవర్, సుధీర్‌బాబు ఓ పాత్ర ఈ చిత్రంలో హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. దర్శకుడు చెప్పిన దానికన్నా వంద శాతం చక్కగా రూపొందించారని, హీరో కృష్ణ కెరీర్‌లో ఓ అపురూప చిత్రంగా నిలుస్తుందని వారు తెలిపారు. నరేష్, సాయికుమార్, పోసాని కృష్ణమురళి, ఎల్బీశ్రీరామ్, తోటపల్లి మధు, దేవదాస్ కనకాల, మురళీశర్మ, కునాల్ కౌశిక్, అనితాచౌదరి, సోఫియా తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: రామ్ కంకిపాటి, సంగీతం: ఇ.ఎస్.మూర్తి, కెమెరా: సతీష్ ముత్యాల, ఎడిటింగ్: రమేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముప్పలనేని శివ.