ఓ బేవార్స్.. కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం -బీచ్ రోడ్ చేతన్. బీచ్ రోడ్‌లో తిరిగే ఓ బేవార్స్‌గాడి కథే ఈ సినిమా అంటున్నాడు చేతన్. రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రాల్లో నటించిన చేతన్ -ఈ సినిమాతో హీరో అయ్యాడు. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. కార్యక్రమంలో హీరోయిన్ తేజరెడ్డి, ఆర్టిస్టులు వీరేష్‌బాబు, రవినాగ్, మోహన్, సినిమాటోగ్రాఫర్ నిశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చేతన్ మద్దినేని మాట్లాడుతూ -ఇంతకుముందు చేసిన చిత్రాలు కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లినా చేతన్ మద్దినేని అనేంత గుర్తింపు రాలేదు. ఆ ఇమేజ్ సాధించే ప్రయత్నంలో -ర అండ్ రియలిస్టిక్ రస్టిక్ కంటెంట్‌తో కథ రాసుకుని స్వీయ దర్శకత్వంలో సినిమా చేశా. సినిమా మొత్తం విశాఖపట్నంలోనే షూట్ చేశాం. కొత్తగా పరిచయం చేస్తున్న వందమంది ఆర్టిస్టులు, టెక్నికల్ టీం సహకారంతో సినిమా సులువుగా పూర్తి చేయగలిగాం. బీచ్ అనగానే యూత్‌ని రిప్రజెంట్ చేసే కథ అని అర్థమవుతుంది. అలా బీచ్‌లో బేవార్స్‌గా తిరిగే ఓ కుర్రాడి కథ ఇది. చేతన్ అనే కుర్రాడి పాత్ర పోషిస్తున్నా. ఈ సినిమాతో చేతన్ మద్దినేనిగా నాకు మంచి గుర్తింపు వస్తుందన్న నమ్మకంతో ఉన్నా. అక్టోబర్‌లో సినిమా విడుదల చేయడానికి ప్లాన్ సిద్ధం చేస్తున్నాం అన్నారు. హీరోయిన్ తేజ రెడ్డి మాట్లాడుతూ -న్యా పాత్ర డీసెంట్‌గా, ప్రజెంట్‌గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్‌కి స్కోప్‌వున్న పాత్ర. సినిమా మంచి బ్రేక్ నిస్తుందన్న నమ్మకం ఉంది. అవకాశమిచ్చిన చేతన్ మద్దినేనికి థాంక్స్ అంది. సినిమాటోగ్రాఫర్ నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ -చిన్న సినిమాగా మొదలెట్టి పెద్ద సినిమా రేంజ్‌లో చేశాం. టెక్నీషియన్స్ అంతా పెద్దవాళ్లే వర్క్ చేశారు. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. క్రెడిట్ మొత్తం చేతన్ మద్దినేనికే దక్కుతుంది అన్నారు. షార్ట్ ఫిల్మ్‌లో చేస్తున్న తమకు చేతన్ సినిమాలో అవకాశం ఇచ్చారని మోహన్, రూపేష్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.