29న జీలకర్ర బెల్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై అభిజిత్, రేష్మ జంటగా విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజిరెడ్డి సంయుక్తంగా రూపొందించిన చిత్రం జీలకర్ర బెల్లం. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ హాలులో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత నౌరోజిరెడ్డి మాట్లాడుతూ.. యువత నేటి కాలంలో ఎదుర్కొంటున్న సమస్య ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించామని, ప్రేమించి పెళ్లిచేసుకుని, వెంటనే విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? మంచి చదువు, సంపాదన ఉండడంతో తల్లిదండ్రుల అదుపు లేకపోవడంతో యువత ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుంది? సందేశాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం కామెడీ, క్రైమ్, రొమాన్స్ లాంటి అన్ని ఎలిమెంట్స్‌తో ఉంటుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తెలుగు రాష్ట్రాలతోపాటుగా కర్నాటక రాష్ట్రంలో కూడా ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రేమించి పెళ్లిచేసుకున్న జంటల మధ్య ఇగో సమస్యలతో మధ్యలో విడిపోయిన వారి జీవితాలలో ప్రేమ గెలిచిందా? ఇగో గెలిచిందా? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారని కథానాయకుడు అభిజిత్ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోందని, తప్పక విజయవంతవౌతుందన్న నమ్మకం వుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కొమ్మనాపల్లి గణపతిరావు, రేష్మ తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. సుహాసిని మణిరత్నం, రఘుబాబు, తా.రమేష్, సూర్య, ఉత్తేజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కొమ్మనాపల్లి గణపతిరావు.