ఏదైనా జరగొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైమ్‌ని సెట్‌చేసే టైమ్ మనదికానపుడు.. టైమ్ సెట్‌చేసిన టైమ్‌మేరకు లైఫ్‌ని లీడ్ చేయడం -తెలివైనవాళ్ల లక్షణం. అన్నా ఆదుకోమని అడిగినపుడు -అవసరానికి సాయపడటం నాయకుడి కర్తవ్యం. ఈ రెండు అంశాలూ -పవన్ కల్యాణ్ స్క్రీన్‌పైకి రావడానికి దోహదం కావొచ్చంటున్నారు పరిశీలకులు. ఇండస్ట్రీనుంచి వినిపిస్తోన్న కథనాల్ని పరిశీలిస్తే.. సీనియర్ నిర్మాత ఎఎం రత్నం చాలాకాలంగా ఓ ప్రాజెక్టు చేసిపెట్టాలంటూ పవన్ కల్యాణ్‌ను అడుగుతున్నారట. ఇటీవలి కాలంలో రత్నం చేసిన ప్రాజెక్టులు నష్టాల్లోకి లాగేయడంతో -ఓ ప్రాజెక్టు చేసిపెట్టి బయటపడేయాలని కోరారని వినిపిస్తోంది. ఆ అభ్యర్థనకు ఇప్పుడు ఓకే చెప్పే అవకాశం లేకపోలేదనీ అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్‌గా బిజీగా గడిపన పవన కల్యాణ్, ఇప్పుడు కొంత విశ్రాంతి దొరికింది కనుక ఓ ప్రాజెక్టు చేసిపెట్టే అవకాశం లేకపోలేదన్న మాట వినిపిస్తోంది. అయితే, జనసేనను బలోపేతం చేసేందుకు పొలిటికల్ యాత్ర నిర్వహించే ఆలోచన పవన్ మదిలో లేకపోలేదు. ఆ యాత్రకు ముందే ఓ విప్లవ నాయకుడి కథతో ప్రజల్లో చైతన్యం నింపి, తరువాత యాత్రపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదన్న మాటా వినిపిస్తోంది. దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నం సంయుక్తంగా పవన్‌ను కలిసి -దీనిపై చర్చలు జరిపారనీ అంటున్నారు. పవన్ బలంగా నమ్మే ‘సత్య’ సిద్ధాంతాన్ని ప్రభోదాత్మకంగా చెప్పే కథను క్రిష్ వినిపించారన్న కథనాలూ లేకపోలేదు. ఈ కథనాలు ఎంతవరకూ నిజమన్నది ఎవ్వరూ అంచనా వేయలేని పరిస్థితే. నిప్పులేనిదే పొగరాదన్నది తెలుగు సామెత. కథనాల్లోని సారం నిజమై -కాంబినేషన్ కనుక సెట్టయితే అదొక సెనే్సషనే అన్నది కాదనలేని వాస్తవం. అటు మణికర్ణిక, ఇటు ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్టులతో చేదు అనుభవాన్ని చవిచూసిన క్రిష్ -అకస్మాత్తుగా ఎలాంటి ప్రకటనతో వస్తాడోనన్న ఆసక్తి మాత్రం ఇండస్ట్రీలో లేకపోలేదు.