ఆమెకు మరో చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాదాస్పద పాత్రలవైపూ తెగింపుగా అడుగులేసే గట్స్ అమలాపాల్ సొంతం. ఇటీవలే వచ్చిన ‘ఆమె’ గొప్ప ఫలితం సాధించకున్నా -తను పోషించిన ‘న్యూడ్’ పాత్రతో సంచలనమే సృష్టించింది అమలాపాల్. అయితే కేరీర్ ఆరంభంలో తెలుగు, తమిళ భాషల్లో వెలుగు వెగిలిన బ్యూటీకి -ఇటీవల తెలుగులో అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. అదే సమయంలో వ్యక్తిగత సమస్యల్లోనూ అమల కూరుకుపోవడంతో -ఇక ఆమెకు అవకాశాలు కష్టమేనన్న నిర్ణయానికి వచేశారు. దీంతో తమిళంలో మాత్రం సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది అమలాపాల్. నటనకు అవకాశమున్న పాత్రల్నే చేస్తున్న అమలకు, తాజాగా తెలుగునుంచి ఓ గ్లామర్ ఆఫర్ అందినట్టు తెలుస్తోంది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ కొత్త చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుండటం తెలిసిందే. ఈ కొత్త ప్రాజెక్టులో రాజశేఖర్‌కు జోడీగా అమలాపాల్‌ను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.