అనుష్క.. బొమ్మల కథ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైజ్ జీరోలో నవ్వుతూ ఏడిపించి.. బాహుబలిలో మాహిష్మతి రాజమాతకు ధిక్కార స్వరాన్ని వినిపించి.. భాగమతిలో భయపెట్టి పరిగెత్తించిన అందమైన అనుష్క- ఇప్పుడు నిశ్శబ్ధాన్ని ఆవరిస్తోంది. అనుష్క చేస్తున్న ‘సైలెన్స్’ ప్రాజెక్టు గురించి చాలాకాలంగా వినిపిస్తున్నా -ఇంతవరకూ ఎలాంటి అప్‌డేట్ లేదు. తాజాగా ఆ చిత్రంనుంచి అనుష్క లుక్ విడుదలైంది. దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో అనుష్క ఓ మూగదైన క్రియేటివ్ ఆర్టిస్ట్ పాత్ర చేస్తోంది. యూఎస్ బ్యాక్‌డ్రాప్‌లో -ఓపెన్ ప్లేస్‌లో కూర్చుని తన క్రియేటివ్ థాట్స్‌ని కాన్వాస్‌కు ఎక్కిస్తోన్న ఆర్టిస్ట్‌గా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆసక్తిరేకెత్తిస్తోంది. అనుష్కకు జోడీగా మాధవకు కథానాయక పాత్ర పోషిస్తుంటే, హాలీవుడ్ నటుడు, కిల్‌బిల్ ఫేమ్ మిఖాయిల్ మాడ్సన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌లో నిర్మితమవుతోన్న థ్రిల్లర్‌పై -సినీవర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది.