ఈనెల్లోనే పండుగాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలీ, రిషిత జంటగా శ్రీ వేంకటేశ్వర విద్యాలయమ్స్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం -పండుగాడి ఫొటో స్టూడియో. బాబూమోహన్, వినోద్‌కుమార్, జీవ, సుధా, చిత్రం శీను, శ్రీలక్ష్మి మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు. గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన చిత్రానికి దిలీప్‌రాజా దర్శకుడు. సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమా సెప్టెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తేనున్నట్టు చిత్రబృందం చెబుతోంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా తెరకెక్కింది. సినిమాలో అలీ ఎవరికి ఫొటోతీసినా వారికి వెంటనే వివాహం నిశ్చయమయ్యే ప్రధానాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం చెబుతోంది. పాటలు, ఫైట్స్‌తో అలీ ప్రేక్షకులను అలరించనున్నాడు. తన తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారన్న ఆశాభావాన్ని నిర్మాత గుదిబండి వెంకట సాంబిరెడ్డి వ్యక్తం చేశారు. సంగీతం యాజమాన్య, కెమెరా మురళీమోహన్‌రెడ్డి సమకూర్చారు.