నల్లమలపై మేము సైతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమలను కాపాడుకుందాం -అంటూ సెలబ్రిటీలు గొంతు విప్పుతున్నారు. యురేనియం తవ్వకాల నుంచి ‘సేవ్ నల్లమల’ అంటూ ఒక్కొక్కరుగా గొంతు విప్పుతున్నారు. తెలంగాణలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రూపుదిద్దుకోవడం తెలిసిందే. విద్యుత్ అవసరాల కోసం యురేనియం తవ్వకాన్ని ఒప్పుకునేది లేదంటూ అధికారేతర రాజకీయ పక్షాలు ఇప్పటికే ప్రకటిస్తే -ప్రస్తుతం సినీ పరిశ్రమ నుంచీ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే యురేనియం తవ్వకాలపై విజయ్ దేవరకొండ ఘాటైన వ్యాఖ్యలే చేశాడు. ‘విద్యుత్ అవసరాల కోసం యురేనియం ఎక్కడైనా కొనొచ్చు.. అడవులను ఎక్కడ కొనాలి’ అంటూ సూటిగా ప్రశ్నించాడు. తాజాగా హీరో సాయిధరమ్ తేజ్ సైతం సోషల్ మీడియాలో స్పందించారు. ‘అమెజాన్ అంటుకుంటే ఇక్కడ కంటతడి పెట్టాం. ఇప్పుడు మనమేం చేస్తున్నాం. రండి... ప్రకృతిని పరిరక్షించుకుందాం. సేవ్ నల్లమల’ అంటూ సోషల్ మీడియాలో సాయితేజ్ ట్వీట్ చేశాడు. నల్లమల భవిష్యత్‌పై నటి, యాంకర్ అనసూయ సైతం తన వాయిస్ వినిపించారు. తెలుగు రాష్ట్రాలను కలుపుతూ వేల ఎకరాల్లో విస్తరించిన నల్లమలను నాశనం చేయొద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రేడియో ధార్మిక యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతించడం అనర్థాలకు ఆయువంటూ ఇన్‌స్టాలో పోస్టుపెట్టారు. తవ్వకాల కారణంగా ఒక్కసారి భూమి అణు ప్రభావానికి గురైతే -్భవిష్యత్‌లో గడ్డిపోచ కూడా మొలవదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని -నల్లమలను పరిరక్షించుకోవాలని సూచించారు. సేవ్ నల్లమల ఉద్యమానికి సపోర్ట్ వ్యాఖ్యలేనా? సామాజిక నైతిక బాధ్యతగా ఉద్యమానికి భౌతిక మద్దతు ఉంటుందా? అంటూ ప్రకటనలపై కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.