గ్యాంగ్‌లీడరే.. మాట్లాడతాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్‌ల కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ -నానిస్ గ్యాంగ్‌లీడర్. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. హీరో కార్తికేయ ప్రధాన పాత్ర పోషించారు. సినిమా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకోవడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. కార్యక్రమంలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ -సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడమే కాదు, మంచి కలెక్షన్లతో ముందుకెళ్తోంది. మైత్రీ బ్యానర్‌లో చేసిన మరో బెస్ట్ ఫిల్మ్ ఇది. నాని కెరీర్‌లో ఈ సినిమాకు బెస్ట్ ఓపెనింగ్స్ రావడమే కాదు, లాంగ్ రన్‌లో బెస్ట్ కలెక్షన్లు తెస్తుందని అంచనా వేస్తున్నాం అన్నారు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ -ఆడియన్స్ చూపిస్తోన్న లవ్ అండ్ కేర్‌కి కృతజ్ఞతలు. థియేటర్స్‌లోనే సినిమా చూడండి అన్నారు. మైత్రి సిఇఓ చిరంజీవి మాట్లాడుతూ -ఎక్కడ చూసినా సినిమా బావుందన్న వన్ వర్డ్ రివ్యూ వినిపిస్తోంది. సినిమాను ఓన్ చేసుకున్న ఆడియన్స్‌కి థాంక్స్ అన్నారు. సినిమాటోగ్రాఫర్ మిరోస్లా మాట్లాడుతూ -ఈ సినిమా ప్లజెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందన్నారు. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ మాట్లాడుతూ -గ్యాంగ్‌లీడర్ సినిమా రెస్పాన్స్‌తో చాలా సంతోషంగా ఉందన్నారు. నటుడు కార్తికేయ మాట్లాడుతూ -ఈ సినిమాకు సంబంధించి సంతోషం అన్నది నాదృష్టిలో చిన్న మాట. సినిమా ఒప్పుకున్నపుడు ఏదేదో విన్నా. కాని -నా పాత్రకి మంచి రెస్పాన్స్ రావడం డ్రీమ్‌లా ఉంది. ఇన్‌స్పిరేటర్‌గా ఉండే నాని ఈ సినిమాతో నా మైండ్‌లో మెంటార్ ప్లేస్‌కి వచ్చేశాడు అన్నారు. హీరో నాని మాట్లాడుతూ -నేను లోకల్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఫీల్డర్స్ లేని గ్రౌండ్‌లో ఫోర్ కొడితే కిక్కే ఉండదని. ఆ డైలాగ్ ఎడిటింగ్‌లో తీసేశాం. కానీ ఇప్పుడు వాడాలనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్ రోజు రకరకాల విషయాలు భయపెట్టాయి. ఎన్ని అడ్డంకులున్నా ప్రతి షోకి గ్రాఫ్ అలా పైకి వెళ్లింది. ఈరోజు మార్నింగ్ షోస్ ఇంకా స్ట్రాంగ్‌గా మొదలయ్యాయి. ఇప్పటిదాక మేం మాట్లాడాం. ఇక సినిమా మాట్లాడుతుంది. గ్యాంగ్‌లీడర్‌ను ఓన్ చేసుకొని మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మైత్రి మూవీ మేకర్స్‌కి మరో హిట్ పడింది అనే మెస్సేజ్ చూసి హ్యాపీగా ఫీలయ్యా. రిలీజ్ టెన్షన్ లేకుండా మాకు ఇంతటి పాజిటివిటీ ఇచ్చిన ప్రతిఒక్కరికీ థాంక్స్ అన్నారు.