వీడొక.. ప్రేమపిపాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌ఎస్‌ఆర్ ప్రొడక్షన్స్‌పై రాహుల్ బాయ్ మీడియా అండ్ దుర్గశ్రీ ఫిలింస్‌తో కలిసి పిఎస్ రామకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం ప్రేమపిపాసి. సెర్చింగ్ ఫర్ ట్రూ లవ్ ట్యాగ్‌లైన్. కొత్త దర్శకుడు మురళి రామస్వామి తెరకెక్కించాడు. సుమన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్‌ని సీనియర్ నటి జమున, సహజనటి జయసుధ, నటుడు బాబూమోహన్, నిర్మాతలు సి కల్యాణ్, అంబటి రామకృష్ణ చేతులమీదుగా లాంచ్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ -ప్రముఖుల చేతుల మీదుగా మోషన్ పోస్టర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. త్వరలో ఆడియో సహా టీజర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. చిత్ర దర్శకుడు మురళి రామస్వామి మాట్లాడుతూ -ఇప్పటికే డబ్బింగ్ పార్ట్ పూర్తయింది. ఆర్‌ఆర్ జరుగుతోంది. త్వరలో టీజర్ లాంచ్ చేస్తాం. లవ్ రొమాన్స్, కామెడీతోపాటు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తెరకెక్కించాం. మోషన్ పోస్టర్‌ను విడుదలచేసిన పెద్దలకు కృతజ్ఞతలు అన్నారు.