ఇదో నవ్వుల దెయ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుగారి గది, రాజుగారి గది-2 చిత్రాలు సూపర్, అయిన విషయం రాజుగారి గది సిరీస్‌లో భాగంగా మూడో సీక్వెల్‌ను తెస్తున్నాడు దర్శకుడు ఓంకార్. అశ్విన్‌బాబు, అవికా గోర్ హీరో హీరోయిన్లు. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న చిత్రం -రాజుగారి గది 3. దసరాకు సినిమాను థియేటర్లకు తెచ్చేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా చిత్రం ట్రైలర్‌ను సీనియర్ హీరో వెంకటేష్ విడుదల చేశారు. కార్యక్రమంలో హీరో అశ్విన్‌బాబు మాట్లాడుతూ -నన్ను సరికొత్త కోణంలో ఆవిష్కరించాడు అన్నయ్య ఓంకార్. రూపాయికి మూడొంతులు అదనంగా ఎంజాయ్ చేస్తారు. సీనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కలిసి చేసిన సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నా అన్నాడు. హీరోయిన్ అవికాగోర్ మాట్లాడుతూ -మూడేళ్ల తరువాత తెలుగులో చేస్తున్న సినిమా ఇది. ఓంకార్ స్టోరీ నేరేట్ చేసినప్పుడు థ్రిల్ ఫీలయ్యా. మంచి సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ది బెస్ట్ అవుట్‌ఫుట్‌ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నా అన్నారు. అందమైన దెయ్యం ఆహ్లాదంగా నవ్వించే కథగా మూడో సీక్వెల్‌కు హిట్టు ఖాయమన్నాడు సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా. దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ -రాజుగారిగది, రాజుగారిగది -2 సినిమాలు హిట్టయ్యాయి. గది-2లో కామెడీ మిస్సయ్యిందన్న కామెంట్స్ వచ్చాయి. వాటిని ఫుల్‌ఫిల్ చేస్తూ ఈ స్క్రిప్ట్ రెడీ చేశా. సినిమా మొదలుపెట్టినపుడే -దసరాకు విడుదల అనుకున్నాం. జూన్‌లో మొదలుపెట్టి రెండు నెలల్లో సినిమా పూర్తి చేయడానికి కారణం -చోటా కె నాయుడి సహకారమే. సాయిమాధవ్ డైలాగులు, షబ్బీర్ మ్యూజిక్, గౌతమ్‌రాజు ఎడిటింగ్ సినిమాకి ప్లస్ పాయింట్లు. ఆలీ, బ్రహ్మాజీ, అజయ్‌గోష్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాజుగారి గది 3 హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్ చేస్తుందన్నారు.