పాయల్‌నుంచి మరో స్పెషల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎక్స్ 100తో హాట్ బ్యూటీ ఇమేజ్ తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్. ఆ చిత్రంతో వచ్చిన ఇమేజ్‌ను నిలబెట్టుకోడానికి -తరువాతి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. వెంకీమామ, డిస్కోరాజాలాంటి పెద్ద చిత్రాల్లో అవకాశం అందుకున్న పాయల్, ఆర్డీఎక్స్ లవ్‌లాంటి హాట్ చిత్రాలనూ వదిలిపెట్టలేదు. మంచి పాత్రలను ఎంచుకుంటూనే -‘హాటీ’ ఇమేజ్ కంటిన్యూ చేయడానికి ప్రత్యేక గీతాల్లోనూ మొహమాటం లేకుండా కనిపిస్తోంది పాయల్. ఆమధ్య తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’లో తనదైన స్టయిల్‌లో స్పెషల్ సాంగ్ చేసి ఊరించిన పాయల్, రాబోయే మరో ప్రాజెక్టులోనూ ప్రత్యేక గీతంలో నర్తించేందుకు ఓకే చెప్పిందని అంటున్నారు. అదీ తేజ చిత్రంలోనే అన్నది ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట. మరో లేడీ ఓరియెంటెడ్ కథను తదుపరి ప్రాజెక్టుగా సిద్ధం చేసుకుంటున్న తేజ, పాయల్‌ను స్పెషల్ సాంగ్‌కు తీసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇద్దరిలో ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేస్తేగానీ, ఈ ప్రచారంలో పస ఎంత? అన్నది తేలదు.