మోదీ బయోపిక్ మన్ బైరాగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న బయోపిక్‌కు -మన్ బైరాగి టైటిల్ ఖరారైంది. దర్శకుడు సంజయ్ త్రిపాఠి తెరకెక్కిస్తోన్న బయోపిక్‌ను సంజయ్ లీలా బన్సాలీ, మహావీర్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో మనో విరాగి పేరిట విడుదలకానుంది. సెప్టెంబర్ 17 నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా మంగళవారం సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. హిందీ, తెలుగు వర్షన్ పోస్టర్లను హీరో ప్రభాస్ తన ఫేస్‌బుక్, ఇన్‌స్టా నుంచి విడుదల చేయడం విశేషం. ‘ప్రత్యేకమైన వ్యక్తిపై రూపొందుతోన్న ప్రత్యేక సినిమా. ప్రత్యేక దినాన ఫిల్మ్ మేరక్స్ ప్రకటన చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు మోదీజీ. సంజల్ లీలా భన్సాలి, మహావీర్ జైన్ నిర్మిస్తోన్న ‘మన్ బైరాగి’ ఫుస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. మోదీ లైఫ్‌కు సంబంధించిన అన్‌టోల్డ్ స్టోరీ, సంజయ్ త్రిపాఠి చెప్పబోతున్నారు’ అంటూ ప్రభాస్ ఓ మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశాడు.