ఓహో.. హిందీ సాహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహో ప్రభాస్ బాలీవుడ్‌లో బాగానే వసూళ్లు రాబట్టాడు. గత 30న విడుదలైన సాహో -బాలీవుడ్‌లో ఇంకా వసూళ్ల జోరు కొనసాగిస్తున్నాడు. విడుదలైన వెంటనే అంచనాలను అందుకోలేక పోయిందన్న టాక్ వచ్చినప్పటికీ -సాహో వసూళ్లు మాత్రం బాగానే పరుగులు తీశాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టినట్టు చిత్రబృందం ఇప్పటికే చెప్పుకుంది. అయితే తెలుగులోకంటే బాలీవుడ్‌లో సాహో తన రేంజ్ చూపించాడు. హిందీలో 3వ వారానికి 150 కోట్ల క్లబ్‌కి చేరటం విశేషమే. సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన సందర్భాల్లోనూ ఒక్క సల్మాన్‌లాంటి హీరోల చిత్రాలు మాత్రమే -్భరీ వసూళ్లు రాబట్టినట్టు చూశాం. ఆ మ్యాజిక్ ఇప్పుడు ప్రభాస్ చిత్రానికీ వర్కౌటైంది. 3వ వారాంతానికి సాహో హిందీ నెట్ కలెక్షన్లు 153 కోట్లు సాధించినట్టు ట్రేడ్ అనలిస్ట్‌లు చెబుతున్నారు.