ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ యంగ్ సెనే్సషన్ విజయ్ దేవరకొండ -వరల్డ్ ఫేమస్ లవర్‌గా కనిపించబోతున్నాడు. విజయ్ -క్రాంతిమాధవ్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్టు టైటిల్‌ని చిత్రబృందం ఖరారు చేసింది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కెఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు -అంటూ అప్పట్లో టైటిల్‌ని సెనే్సషన్ చేసిన దర్శకుడు క్రాంతిమాధవ్.. ఈసారీ సరికొత్త టైటిల్‌ని ఎత్తుకుని ఆసక్తి రేకెత్తించాడు. గత రెండు రోజులుగా టైటిల్స్‌పై ఊహాగానాలు వినిపిస్తున్నా, చిత్రబృందం మాత్రం మంగళవారం క్లాసిక్ టైటిల్‌నే ఖరారు చేస్తూ -పోస్టర్ విడుదల చేసింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అన్న టైటిల్‌తో సినిమా కంటెంట్ అర్థమవుతుంది. సో, విజయ్ మరో డీప్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రానున్నాడన్నది ఖాయం. కాకపోతే, కథలో నలుగురు హీరోయిన్లు ఉండటంతో.. ‘ప్లాట్ ’ ఎలాంటిదై ఉండొచ్చన్న ఆసక్తి రేకెత్తుతోంది. చాలాకాలంగా షూటింగ్ జరుగుతున్నా -ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకుండా దర్శకుడు క్రాంతిమాధవ్ సైలెంట్‌గా తన పని తను చేసేస్తున్నాడు. షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో -అప్‌డేట్స్‌తో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే స్కీం మొదలైనట్టే. అంతేకాదు, సినిమాకు సంబంధించి సెప్టెంబర్ 20న ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. విజయ్ దేవరకొండ సరసన తొలిసారి రాశీఖన్నా జోడీ కడుతుంటే -కేథరిన్ థ్రెస్సా, ఐశర్య రాజేష్, ఇజ్బెల్లా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి గోపీసందర్ సంగీతం, జయకృష్ణ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.