సైరాకు తలనొప్పులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొణిదెల ప్రొడక్షన్స్‌పై చిరంజీవి 151వ చిత్రంగా రామ్‌చరణ్ నిర్మిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం -సైరా. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా విడుదల సమయం దగ్గర పడుతుంటే -చిత్రబృందానికి తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. ఓపక్క -తమకు ఆర్థికంగా న్యాయం చేస్తామని మాటిచ్చిన నిర్మాణ సంస్థ.. ఇప్పుడు మాట మారుస్తుందంటూ ఉయ్యాలవాడ వారసులు మెగా ఫ్యామిలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వంశీకుడైన సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తెరకెక్కిస్తూ, వారసుల కుటుంబాలకు న్యాయం చేస్తామని గత మేలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిర్మాణ సంస్థ ఉల్లంఘిస్తోందని నరసింహారెడ్డి వంశీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉయ్యాలవాడ వంశంలోని మొత్తం 22మందికి ఐదు కోట్లు ఇస్తామంటూ హామీ ఇచ్చారని, ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదంటూ ఐదోతరంలోని సంబంధీకులు హైదరాబాద్‌లో కొణిదెల ప్రొడక్షన్ హౌజ్ ఎదుట ధర్నాకు దిగినట్టు సమాచారం. పోలీసులు రంగప్రవేశం చేసి బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. ఒప్పందం గురించి గట్టిగా అడిగితే -గత నెలలో ఒక తీరున సమాధానమిచ్చారని, ఇప్పుడసలు మేం వారసులమే కాదని, హక్కులే లేవంటూ మాట మారుస్తున్నారని నరసింహారెడ్డి వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తుండటం చిత్రబృందానికి తలనొప్పిగా పరిణమించింది. మరొపక్క సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సైతం అనుకున్న తేదీకి నిర్వహించటం సాధ్యం కాలేదు. వాతావరణ ప్రభావంతో వానలుపడే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో 18న నిర్వహించాల్సిన ప్రీ రిలీజ్ వేడుకను నాలుగు రోజులు వెనక్కి వాయిదా వేసుకున్నారు. అయితే, ట్రైలర్‌ను మాత్రం బుధవారం విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. చిరంజీవి తొలిసారి స్క్రీన్ మీద కనిపించిన ‘ప్రాణం ఖరీదు’ సినిమా వచ్చి సెప్టెంబర్ 22కి సరిగ్గా 40 ఏళ్లవుతున్న నేపథ్యంలో -సెప్టెంబర్ 22నే చిరంజీవి ప్రతిష్టాత్మక 151వ చిత్రం ‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలన్న యోచనలో చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోందని మరో కథనం. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్, రాజవౌళి, కొరటాల శివ, మెగా ప్యామిలో హీరోలు హాజరుకానున్నానరు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రంపై భారీ అంచనాలు లేకపోలేదు.