హరీశ్ రీమిక్స్ మ్యాజిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రీమిక్స్ కోసం యూత్‌కి కిక్కునిచ్చే పాటలెన్నోవున్నా, అకస్మాత్తుగా శోభన్ -శ్రీదేవిని స్క్రీన్‌మీదకు తెచ్చి దర్శకుడు హరీశ్ శంకర్ ఆడియన్స్‌కి మాయ చూపించబోతున్నాడు. వరుణ్‌తేజ్ హీరోగా హరీశ్ శంకర్ తెరెకెక్కించిన చిత్రం -వాల్మీకి. సెప్టెంబర్ 20న థియేటర్లకు వస్తోంది. సినిమా కోసం హరీశ్ ఓ రీమిక్స్ ప్రయోగం చేశాడు. అయితే, కమర్షియల్ కోణంలో పెట్టిన పాట కాదని, పాటకు తగిన సందర్భం, కథానుసరణ ఉన్న కారణంగానే ‘దేవత’ చిత్రంలోని శ్రావ్యమైన పాటను రీమిక్స్ చేశామని చెబుతున్నాడు. దేవత చిత్రం కోసం శోభన్‌బాబు -శ్రీదేవిపై దర్శకుడు కె రాఘవేంద్రరావు చిత్రీకరించిన ‘వెల్లువొచ్చి గోదారమ్మ’ పాటకు అదే గెటప్స్, సేమ్ బ్యాక్‌డ్రాప్‌లో వరుణ్‌తేజ్, పూజా హెగ్దె కనిపించబోతున్నారు. ఆర్ట్ఫిషియల్ సెట్స్, ఫారిన్ లొకేషన్స్‌కు భిన్నంగా -సముద్రం ఒడ్డున బిందెల్ని పేర్చి హీరో హీరోయిన్లను ఆడిపాడించిన దర్శకుడు రాఘవేంద్రరావు అప్పట్లో ఓ అద్భుతానే్న చూపించాడు. ఆ అద్భుతాన్ని ఇప్పుడు వాల్మీకి సినిమా కోసం హరీశ్ శంకర్ రిపీట్ చేస్తూ రీమిక్స్ చేస్తున్నాడన్న మాట. శ్రీదేవి అందమైన నడుము, నడుమొపులో ఇత్తడి బిందె.. పువ్వు చుట్టూ తిరిగే గండు తుమ్మెదలా శ్రీదేవి చుట్టూ తిరుగుతూ శోభన్ స్టెప్పులు.. వాహ్, ఆ పాటు చిత్రీకరణే ఓ అద్భుతం. ఇప్పుడు రీమిక్స్‌లో భాగంగా గోదావరి ఇసుక తినె్నల్లో, చెన్నై నుంచి తెప్పించిన ప్రత్యేక బిందెలతో శ్రీదేవిలాంటి కట్టూబొట్టుతో పూజాహెగ్దె, శోభన్‌బాబు బెల్‌బాటమ్ ఫ్యాంట్స్‌లో వరుణ్‌తేజ్ -ఆడియన్స్‌కి ఓ ఫీస్ట్ ఇవ్వనున్నారట. ఈ రీమిక్స్ హిట్టయితే మాత్రం -తరువాత వచ్చే చిత్రాలకు కొత్త ట్రెండ్‌గా నిలుస్తుందనటంలో సందేహం లేదు.