21న పండుగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెప్టెంబర్‌లోనే వచ్చేస్తానంటూ ఊరిస్తూ వచ్చిన పండుగాడు -ఎట్టకేలకు విడుదల డేట్‌ను ఫిక్స్ చేసుకున్నాడు. 21న థియేటర్లకు వచ్చేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలీ హాస్యనటుడిగా కొనసాగుతూనే, అవకాశం మేరకు హాస్య కథానాయకుడిగానూ సినిమాలు చేస్తున్నాడు. చాలాకాలం తరువాత మళ్లీ హీరోగా చేసిన ప్రాజెక్టే -పండుగాడి ఫొటో స్టూడియో. వీడు ఫొటోతీస్తే పైళ్లైపోయిద్ది అనేది ట్యాగ్‌లైన్. దర్శకుడు దిలీప్‌రాజా తెరకెక్కించిన చిత్రాన్ని నిర్మాత గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించారు. విడుదల కోసం పండుగాడు ఎప్పటికప్పుడు ఎదురు చూస్తున్నా -వరుసగా పెద్ద చిత్రాల తాకిడి ఉండటంతో వాయిదా పడుతూ వస్తున్నాడు. పూరె్తైన సినిమాను ఆలస్యం చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో -సెప్టెంబర్ 21నే థియేటర్లకు సినిమాను తెచ్చేందుకు నిర్మాతలు ముహూర్తం పెట్టుకున్నారని తెలుస్తోంది. అయితే, వరుణ్‌తేజ్ హీరోగా చేసిన వాల్మీకి సెప్టెంబర్ 20న థియేటర్లకు వస్తుంది. ఆ చిత్రంపై పండుగాడు ఎంతవరకూ నెగ్గుకు రాగలుగుతాడో చూడాలి.