గద్దలకొండను ఎంజాయ్ చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి బయోపిక్ వస్తే -్ఫస్ట్ ఛాయిస్ చరణ్ అవుతాడు తప్ప నేను కాదు. చరణ్ అయితేనే బావుంటాడు. ఆయన చేయకపోతే -సెకెండ్ ఛాయిస్ నేనే. తప్పకుండా చేస్తా. డైరెక్టర్ హరీశ్ ఈమధ్యే చిరు బయోపిక్ గురించి ప్రస్తావించాడు.

అసలు పాటంటేనే నాలో తెలీని ప్రెజర్ ఒకటి మొదలవుతుంది. ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ రీమిక్స్‌ని మాత్రం బాగానే చేసేశా. అందుక్కారణం -పాటకు సంబంధించిన హిస్టరీ, వాల్మీకి కథకు కనెక్టివిటీ.. ఈ విషయాల్లో హరీశ్ చాలా క్లారిటీగా ఉన్నాడు. మిగతా క్రాఫ్ట్స్ మరీ పెర్ఫెక్ట్‌గా చేసేశాయి. సో, నేను చేసింది ఒక డ్యానే్స. కానీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆ పాటకొచ్చిన రెస్పాన్స్ అనూహ్యం.

నా కెరీర్ హిస్టరీ చూసి ఆ స్టయిల్ కథ తెచ్చాడు డైరెక్టర్ హరీశ్. అదే -దాగుడుమూతలు. ఇది మీ స్టయిల్ కాదుగా అన్నా. నీ సినిమా ట్రాక్స్ అన్నీ ఇలాంటివేగా అన్నాడు. అయితే, హరీశ్ కైండ్ ఆఫ్ ఎంటర్‌టైనర్ చేస్తే నాకు కొత్తగా ఉంటుందన్నా. ఆ సంభాషణలు జిగర్తాండవైపు జర్నీ చేశాయి. అలా -వాల్మీకి పుట్టుకొచ్చింది అంటున్నాడు హీరో వరుణ్ తేజ్.
ముకుంద, కంచె, లోఫర్‌తో హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్-2లతో ఈ కుర్ర హీరో ట్రాక్ డిఫరెంట్ అనిపించుకున్నాడు. క్లాసిక్ నుంచి ప్రయోగాత్మకంగా ఊరమాస్‌వైపు అడుగులేసి, పక్కా తెలంగాణ మాండలికంతో -పరివర్తన కథను భుజానికెత్తుకున్నాడు వరుణ్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం -వాల్మీకి. సెప్టెంబర్ 20న థియేటర్లకు వస్తోంది.
వరుణ్ తేజ్‌తో ఇంటర్వ్యూ.

ఊరమాస్‌పై కనే్నశారు?
ప్లేబోయ్ జోనర్ చాలా చేశా. ఈ మాస్ ఎక్స్‌పీరియన్స్ కొత్తగా ఉంది. మాస్ క్యారెక్టర్ ఏదైనా -క్యారెక్టరైజేషన్ రీజన్ కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే అప్పీల్ ఉంటుంది. గద్దలకొండ గణేశ్ క్యారెక్టర్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు హరీశ్ శంకర్. క్యారెక్టర్‌ని బాగా ఎంజాయ్ చేశా.
గెటప్ కంటిన్యూ చేస్తున్నారు?
దీన్ని మించిన కంఫర్ట్ బహుశ నాకు తెలీదేమో. ఇంట్లోనూ ఇలాగే ఉంటా. ప్రమోషన్స్ అనుకుంటే అనుకోవచ్చు కూడా. తప్పేముంది?
మాతృకలో మార్పులు చేశారా?
జిగర్తాండ గొప్ప స్క్రిప్ట్. అందుకే స్కెలిటెన్‌ను టచ్ చేయలేదు. కాకపోతే రీమేక్ అన్నపుడు -నేటివిటీ తప్పదు కనుక ఫిఫ్టీ పర్సెంట్ మార్పులు జరిగాయి. గణేశ్ పాత్ర అంత రూడ్‌గా ఎందుకుందన్న నేరేషన్‌ని ఫ్లాష్‌బ్యాక్ రూపంలో -ఆడియన్స్‌కి ఇచ్చాం. కొన్ని సీన్స్ అయితే యాజ్‌టీజ్.
బ్యాడ్ క్యారెక్టర్‌పై ఫ్యామిలీ రియాక్షన్?
నా కుటుంబంలో చాలామంది జిగర్తాండ చూడలేదు. స్నేహితులు మాత్రం -ఇంత అవసరమా? అంటూ ఓ సజెషన్ పడేశారు. కన్ఫ్యూజింగ్ నుంచి ఫైనల్ డెసిషన్ కోసం పెదనాన్న (చిరంజీవి)కి విషయం చెప్పా. హరీశ్‌తో కథ వినిపించాను కూడా. నువ్వు చేయాల్సిన కథ ఇదే అన్నారు చిరంజీవి. ఫిక్సైపోయాను. కాకపోతే ఆయనిచ్చిన చిన్న చిన్న సజెషన్స్ స్టోరీలో ఇంక్లూడ్ చేశాం.
దర్శకుడి మేకింగ్..?
హరీశ్ డిజైన్ క్యారెక్టర్ ఎలివేషన్‌కు బాగా ఉపయోగపడింది. ఎఫ్2లో తెలంగాణ మాండలికం ప్రయత్నించినా -కొంచెం పద్ధతిగా ఉంటుంది. వాల్మీకిలో అదే మాండలికం రూడ్‌గా ఉంటుంది. దర్శకుడిది తెలంగాణ కనుక -డైలాగులూ అంతే కొట్టినట్టుంటాయి. అదే గద్దలకొండ గణేశ్‌కు వర్కౌటైందేమో.
బాబీ సింహా ఇమిటేషన్ లేదా ఇన్‌ఫ్లూయెన్స్..?
అస్సలుండదు. ఆ పాత్రను రిక్రియేట్ చేశానంతే. బాబీ సింహా తెలుగువారే, విజయవాడ. ఆ పాత్రే ఆయనకు నేషనల్ అవార్డు తెచ్చింది.
హరీశ్ వెరీ స్పీడ్. మరి మీరు?
స్లోగా కనిపిస్తానేమోగానీ, వర్క్ మాత్రం ఫాస్ట్‌గా పినిష్ చేయడానికే చూస్తా. ఇద్దరికీ బానే సింకైంది.
14 రీల్స్ ప్లస్.. మీ సినిమాతో మొదలైంది?
రామ్ ఆచంట, గోపీ ఆచంట బ్యానర్‌లో ఫస్ట్ మూవీ నాది కావడం హ్యాపీ. ఇద్దరికీ సినిమా ఒక ఫ్యాషన్. అందుకే, డబ్బుతోపాటు టెక్నికల్ సపోర్టూ వాళ్లనుంచి బాగా అందింది.
పూజ హెగ్దెతో..?
నాలుగేళ్ల క్రితం ముకుంద.. ఇప్పుడు వాల్మీకి. కో ఇన్సిడెంట్ ఏంటంటే -పూజతో ఫస్ట్ యానాంలో షూటింగ్. యాక్టింగ్, డ్యాన్స్‌లో బాగా ఇంప్రూవైంది. దేవి పాత్రకు పూజ పర్ఫెక్ట్. సినిమాలో ఆడియన్స్‌కి ఆమె ఓ ప్లజెంట్ ఫీలింగ్.
మేకోవర్ రిఫరెనె్సస్..?
చిరంజీవే. పునాదిరాళ్లు, వేట చిత్రాలే రిఫరెన్స్.
అధర్వ మురళి పాత్ర..?
అధర్వది ఓ ఆస్పైరింగ్ డైరెక్టర్ క్యారెక్టర్. తెలుగు రాకున్నా -డైలాగ్ నేర్చుకుని మరీ చెప్పాడు. గ్రేట్.
మిగతా పాత్రలగురించి..?
బ్రహ్మానందం చిన్న పాత్ర చేశారు. బ్రహ్మాజీ పాత్ర వెరీ డిఫరెంట్. ఫ్రెండ్ క్యారెక్టర్‌లో సత్య, మరో క్యారెక్టర్‌లో ఛాయ్ బిస్కెట్‌లో చేసే అరుణ్ చేశారు. కాస్టింగ్ బాగా కుదిరింది.
డబ్బింగ్‌కు ఎక్కువ టైంపట్టినట్టుంది?
చాలా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. ఇంటర్వెల్ బ్లాక్‌లో 20 నిమిషాల సీక్వెన్సుంది. అది సినిమాకు కీలకం. పెర్ఫార్మెన్స్‌కీ స్కోప్‌వున్న ఎడిసోడ్ అది. సినిమాలో మేజర్ ట్విస్టూ అదే.
ఒకేసారి రకరకాల ఎమోషన్స్ పండించాలి. ఆ సీన్ ఆడియన్స్ థ్రిల్‌నిస్తుంది. అలాంటి వాటికోసం టైమ్ తీసుకోక తప్పలేదు.
సైరాగా చిరంజీవి..?
సైరా అనే ఏముంది. ఆయనేం చేసినా చూస్తా. ఇంకా చెప్పాలంటే నా సినిమాలకంటే ఆయన సినిమాలే ఎక్కువ చూస్తా.

-మహాదేవ