గరం గరమ్‌గా ఆది నటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది, ఆదాశర్మ జంటగా శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ రూపొందించిన చిత్రం ‘గరం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను హైదరాబాద్‌లో హీరో ప్రభాస్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, ‘గరం’ అనే పేరు బాగుందని, ట్రైలర్‌లో ఆది ఎనర్జిటిక్‌గా నటించారని, సాయికుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి రూపొందిస్తున్న ఈ చిత్రం తప్పక విజయవంతం అవ్వాలని కోరుకున్నారు. పరిశ్రమలో మంచి వ్యక్తిగా పేరున్న ప్రభాస్ చేతుల మీదుగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కావడం శుభసూచకమని, తప్పక విజయవంతం అవుతుందని కథానాయకుడు ఆది తెలిపారు. దేశమంతా ‘బాహుబలి’గా కీర్తిస్తున్న ప్రభాస్ ఈ కార్యక్రమానికి వచ్చి ఆదిని దీవించడంతోనే ఈ చిత్రం విజయం ఖాయమైందని, త్వరలోనే ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నటుడు సాయికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ టి.సురేందర్‌రెడ్డి, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.