స్పీడుపెంచాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్ సినిమాలను పలకరించినంత స్పీడుగా -అతన్ని విజయాలు పలకరించ లేదు. దీంతో కెరీర్ ప్లానింగ్ కోసం కొంత బ్రేక్ తీసుకున్నాడు. మరోపక్క కథలు ఎంపికపైనా ఆచితూడి అడుగులేస్తున్నాడు. ఈ రెండంశాల ప్రణాళికకు ప్రాధాన్యతనిస్తూ -సైన్ చేసిన ప్రాజెక్టే చాణక్య. తన బాడీ మాస్‌కి సరిపోయే స్పై క్యారెక్టర్ పోషిస్తున్నాడు. చాణక్య షూటింగ్ జరుగుతున్న టైంలోనే -తరువాతి ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేసుకున్నాడు. స్టార్ డైరెక్టర్ల మొనాటినీ నుంచి బయటపడేందుకు సుబ్రహ్మణ్యం అనే కొత్త దర్శకుడికి గోపీచంద్ చాన్స్ ఇచ్చాడు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఆ సినిమా రూపొందనుంది. హీరోయిన్‌గా కాజల్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు చాణక్య షూటింగ్ దాదాపు పూరె్తైన నేపథ్యంలో -మరో ప్రాజెక్టుకీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు గోపీచంద్. సంపత్ నంది దర్శకత్వం వహించనున్న సినిమాను ‘యూ టర్న్’ ఫేమ్ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్‌పై ప్రొడక్షన్ 3గా సినిమా తెరకెక్కనుంది. హైబడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ప్రెస్టీజియస్ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలూ త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు. సంపత్ -గోపి కాంబినేషన్‌లో గతంలో గౌతమ్‌నందా వచ్చింది. వీళ్ల కాంబోలో ఇది రెండో ప్రాజెక్టు అయితే, గోపీచంద్‌కి 28వ ప్రాజెక్టు. హీరోయిన్, ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు ఎవరన్నది తెలియాల్సి ఉంది.