నితిన్ రంగ్ దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దసరా సందర్భంగా కొత్త ప్రాజెక్టుని మొదలెట్టేశాడు హీరో నితిన్. నితిన్, కీర్తిసురేష్ హీరో హీరోయిన్లుగా రంగ్ దే సినిమా లాంచ్ అయ్యింది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. నితిన్, కీర్తిలపై స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. దిల్ రాజు, ఎస్ రాధాకృష్ణ.. దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. కార్యక్రమంలో జెమినీ కిరణ్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న -లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్. టెక్నికల్‌గా క్వాలిటీపై ఎక్కువ ఫోకస్ చేసే నిర్మాత నాగవంశీ -రంగ్ దే విషయంలోనూ హై స్టాండర్డ్స్ టెక్నీషియన్స్‌ని తీసుకున్నారు. అందులో భాగంగా సినిమాటోగ్రఫీ పీసీ శ్రీరామ్, సంగీతం దేవీశ్రీ ప్రసాద్ సమకూరుస్తున్నారు. గతంలో నితిన్ ‘ఇష్క్’ చిత్రానికీ పీసీ సినిమాటోగ్రఫీ సమకూర్చారు. నరేష్, రోహణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెనె్నల కిషోర్, సత్యంరాజేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ కంటిన్యూ చేసి, వచ్చే వేసవికి చిత్రాన్ని థియేటర్లకు తేనున్నారు.