మొదలెట్టాడు సీనయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు వివి వినాయక్‌ని హీరోగా పరిచయం చేస్తున్న సినిమా -సీనయ్య. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమా ప్రారంభమైంది. దర్శకుడు నరసింహ తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సీనయ్య ముహూర్తపు షాట్‌కి కె రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, డైరెక్టర్ కొరటాల శివ కెమెరా స్విచాన్ చేశారు. కార్యక్రమంలో దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, నిర్మాతలు బివీఎస్‌ఎన్ ప్రసాద్, సి కళ్యాణ్, దానయ్య డివివి, అనీల్ సుంకర, బెల్లంకొండ సురేష్, బెక్కెం వేణుగోపాల్, వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ -వినయ్‌తో ‘ఆది’ సినిమా నుంచి నా జర్నీ మొదలైంది. తరువాత మా సంస్థ స్థాపించాక తొలి సినిమాగా ఆయన దర్శకత్వంలో దిల్ నిర్మించాం. ఆ సినిమా హిట్టు నా ఇంటిపేరునే మార్చేసింది. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేసిన నరసింహ వేరే కథ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు సీనయ్య కథ అనుకున్నాడు. ప్రాసెస్‌లో భాగంగా కథ విన్నపుడు నచ్చింది. 1982-84 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సీనయ్య అనే వ్యక్తి కథ. కంప్లీట్ ఎమోషనల్ స్టోరీ. ఈ కథతో మంచి ప్రయోగం చేద్దామని ఆలోచిస్తున్న తరుణంలో -దర్శకుడు వినయ్ తళుక్కున మెరిశాడు. అదే విషయాన్ని వినయ్‌కి చెప్పడం, అతను ఒకే అనడం జరిగిపోయాయి. నా నిర్ణయంపై తలెత్తిన అనేక సందేహాలు -్ఫస్ట్‌లుక్ తర్వాత మాయమైపోయాయి. సమ్మర్‌లో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం. కథలో భాగమవుతున్న హరి, ఫ్యూచర్‌లో మా బ్యానర్ నుంచి డైరెక్టర్‌గా ఇంట్రొడ్యూస్ కానున్నాడు. మణిశర్మ సంగీతం, సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. సినిమాలో కొత్త ఆర్టిస్టులకు ఎక్కువ అవకాశం ఇవ్వనున్నాం. మంచి కథవుంటే రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నాం అన్నారు. హీరో వివి వినాయక్ మాట్లాడుతూ -డెస్టినీ నాకు వింతగా ఉంది. ఓ రోజు దిల్‌రాజు వచ్చి -నువ్వు నన్ను దిల్‌రాజుని చేశావ్. నేను నిన్ను హీరోని చేద్దామనుకుంటున్నా అన్నారు. స్క్రిప్ట్ వింటున్నపుడే -ఆ పాత్రను దర్శకుడు ఎంతగా ప్రేమించాడో అర్థమైంది. ఆ పాత్రకు న్యాయం చేయాలనే బరువు తగ్గాను. సినిమాకి స్క్రిప్ట్‌పరంగా హరి సపోర్ట్ చేస్తున్నాడు. ఫస్ట్‌లుక్ బావుందని అభినందించిన అందరికీ థ్యాంక్స్ అన్నారు. దర్శకుడు నరసింహ మాట్లాడుతూ -సీనయ్యగా వినాయక్‌కు ఇది తొలి పుట్టినరోజు. వినాయక్, దిల్‌రాజు నన్ను నమ్మి కొత్త బాధ్యత అప్పగించారు. ఇదొక ఎమోషనల్ స్టోరీ. అందుకు తగిన టెక్నీషియన్స్ ఇచ్చారు. అందరి సపోర్ట్‌తో నా బాధ్యతను కరెక్ట్‌గా నిర్వహిస్తానని చెబుతున్నా అన్నారు. రైటర్ హరి మాట్లాడుతూ -‘దిల్‌రాజుతో పదేళ్ల ట్రావెల్ నాది. వినాయక్ పెద్ద దర్శకుడైనా ఆర్టిస్ట్‌గా ప్రతి విషయాన్ని తెలుసుకుని ఫిజికల్‌గా, మెంటల్‌గా రెడీ అయ్యారు. మేంకూడా మా వంతు ప్రయత్నంగా సినిమాను చక్కగా తీర్చిదిద్దాం. అందరూ గర్వంగా చెప్పుకునేలా సినిమా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాం అన్నారు.