సావుకి ఎదురెళ్లి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తి హీరోగా డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తోన్న చిత్రం -ఖైదీ. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. తమిళం, తెలుగు భాషల్లో దీపావళిని టార్గెట్ చేస్తూ వస్తోన్న చిత్రం. తాజాగా సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. పాటలు, రొమాన్స్ లేకుండా యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ కట్ చేయడం విశేషం. క్రైమ్ నేపథ్యంలో లోడెడ్ యాక్షన్ సినిమాగా వస్తోన్న ఖైదీపై కార్తి పెద్ద నమ్మకంతోనే ఉన్నాడు. ఖైదీ ఆది శంకరం పాత్ర పోషిస్తోన్న కార్తి -మాస్ మేకోవర్ అద్భుతంగా ఉంది. 840 కోట్ల ఖరీదు చేసే 900 కేజీల డ్రగ్స్‌ని పోలీసులు సీజ్ చేస్తారు. పోలీసుల్ని లేపేసి డ్రగ్స్ పట్టుకుపోవాలనుకుంటాడు ముఠా నాయకుడు. అదే టైంలో యావజ్జీవ శిక్ష పడిన ఖైదీ ఆది శంకరం జైలు నుంచి తప్పించుకుంటాడు. బయటికొచ్చిన అతను డ్రగ్స్ ముఠా నుంచి పోలీసుల్ని ఎలా కాపాడాడు? ఎందుకు కాపాడాడు? పోలీసులతో ఖైదీకున్న సంబంధమేంటి? అన్నది తెరపైనే చూడాలి. చైల్డ్ సెంటిమెంట్, లోడెడ్ యాక్షన్‌తో దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాను డిజైన్ చేశాడన్నది అర్థమవుతోంది. చుట్టుముట్టిన డ్రగ్స్ ముఠానుచూసి పోలీసు అధికారి భయపడుతున్నపుడు -‘ఏందీ చస్తామని భయమేస్తుందా? సావునైనా ఎదిరించి సావాలి సార్.. ఇలా కాళ్లమీద పడి కాదు’ అంటూ కార్తి చెప్పే డైలాగ్ ట్రైలర్‌కు హైలెట్‌గా ఉంది. దీంతో ఆ పాత్ర స్వభావం, ఇంటెన్సిటీని దర్శకుడు చెప్పకనే చెప్పాడు.