7న ఏడు చేపల కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్ర సినిమా ఆర్ట్స్ రాజేష్‌రెడ్డి సమర్పణలో జీవిఎన్ శేఖర్‌రెడ్డి నిర్మాతగా ఎస్‌జె చైతన్య దర్శకత్వం వహించిన చిత్రం -ఏడు చేపల కథ. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం టీజర్ విడుదల చేసి మీడియా సమావేశం నిర్వహించింది చిత్రబృందం. నిర్మాత శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ -ఏడుచేపల కథ ఓ మెసేజ్ ఓరియంటెండ్. పధ్నాలుగురు అమ్మాయిలతో దర్శకుడు చైతన్య అద్భుతంగా తెరకెక్కించారు. కథకి వాళ్లే కీలకం. హీరో టెంప్ట్ రవి, సునీల్ క్యారెక్టర్లు అద్భుతంగా ఉంటాయి. బిగ్‌బాస్ భానుశ్రీ, అక్షర, యషిక ఇలా ఎంతోమంది తెలుగు అమ్మాయిలకు అవకాశమిచ్చాం. దర్శకుడు చైతన్యకు మంచి పేరు రావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు శ్యామ్ మాట్లాడుతూ -చిన్న సినిమా లైఫ్‌ను డిసైడ్ చేసేది టీజర్. అది క్లిక్కయితే మూవీ హిట్. టీజర్ చూసి బూతు సినిమా అన్నట్టు కామెంట్లు పెట్టారు. అలాంటిదేమీ సినిమాలో ఉండదు. టెంప్ట్ రవి పాత్రలో మంచి ఫన్ ఉంటుంది. ఫన్ ఎంటర్‌టైనర్‌గా యూత్‌ను టార్గెట్ చేసే సినిమా ఇది. అడల్డ్ మూవీయేకానీ, మా తపన సినిమాలో కనిపిస్తుంది అన్నారు. మేఘాచౌదరి మాట్లాడుతూ -టీజర్‌తోనే సినిమాకు క్రేజ్ వచ్చింది. ట్రైలర్‌ను హిట్ చేసినట్టే సినిమానూ హిట్ చేస్తారని ఆశిస్తున్నాం అన్నారు. అయిషాసింగ్ మాట్లాడుతూ -తెలుగులో ఇది తొలి సినిమా. కాంట్రవర్సీలను పక్కనపెట్టి సినిమా చూడండి.. మీకే అర్థమవుతుంది అన్నారు. సునీల్, ఇషిక, అనుపమ తదితరులు పాల్గొన్నారు.