షాకిస్తోన్న బాలయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ వేగంగా సినిమాలు చేస్తుంటాడు. సెంచురీ సినిమా తరువాత కూడా -యువ హీరోలతో పోటీపడుతున్నాడు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పట్టాలెక్కించాలన్న విషయంలో బాలయ్య ఎప్పుడూ క్లారిటీగా ఉంటాడనటంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ బాలయ్య పారితోషికంపై ఎలాంటి ముచ్చట్లు లేకున్నా.. తాజా ప్రాజెక్టు విషయంలో మాత్రం ‘పెంచేశాడు’ అన్న ముచ్చట వినిపిస్తోంది. దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో సి కల్యాణ్ నిర్మిస్తోన్న ప్రాజెక్టులో బాలయ్య ఓ వైవిధ్యమైన హీరోయిజాన్ని చూపించబోతున్నాడట. ఈ సినిమాకి 10 కోట్ల పారితోషికం అందుకున్నారనేది ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోన్న మాట. ఇంతకుముందు నాలుగైదు కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకునే బాలయ్య, ఈ సినిమా కోసం భారీ పారితోషికం డిమాండ్ చేసినా సి కల్యాణ్ వెనక్కి తగ్గలేదన్న మాట వినిపిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశం లేకపోలేదు.