కానె్సప్ట్.. ది బెస్ట్ అన్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులాల పట్టింపుల కారణంగా నా
స్నేహితుడు ఒకతను దారుణమైన
బ్రేకప్‌ను ఫేస్ చేశాడు. నిజంగా
ఓ మంచి లైఫ్‌నే మిస్సయ్యాడు.
ప్రేమికుల మధ్య కులాల సమస్యకు
పరిష్కారాన్ని ఆలోచిస్తున్న టైంలో పుట్టిన థాట్ ఇది. ఆ ఆలోచనే
ఇతివృత్తంగా సినిమా అల్లుకున్నా -అంటున్నాడు ఎవరికీ చెప్పొద్దు
దర్శకుడు బసవ శంకర్.
రాకేశ్ వర్రె హీరోగా నటించి నిర్మించిన సినిమా -ఎవ్వరికీ చెప్పొద్దు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రంలో గార్గేయి ఎల్లాప్రగడ హీరోయిన్. దర్శకుడు బసవ శంకర్ తెరకెక్కించిన చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో -మంగళవారం దర్శకుడు శంకర్, హీరోయన్ గార్గేయ మీడియాతో మాట్లాడారు.
* నిజానికి హీరో రాకేశ్‌కి కథ చెప్పడంకంటే ముందే ఓ ప్రొడక్షన్ హౌస్ ఈ కథను ఓకే చేసింది. కాకపోతే, అక్కడ ఆలస్యం అవుతుండటంతో, ఓ స్నేహితుడి రిఫరెన్స్ ద్వారా రాకేశ్ కలిశాడు. రాకేశ్ -ఏ విషయంలోనైనా ప్లాన్డ్‌గా ఉంటాడు. దర్శకుల్ని అప్రోచ్ అయ్యే విధానం కూడా ఇంటిలిజెంట్ వేలో అంటుంది. అలా కనెక్టై -రాకేశ్ హీరోగా సినిమా చేశా.
* నేను హైద్రాబాద్‌లోనే పుట్టి పెరిగా. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఒక సినిమాకు పని చేశా. తరువాత ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో కొంతకాలం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసి మళ్లీ మరో సినిమాకు వర్క్ చేశా. ఆ తరువాత బిస్కెట్, కాలక్రమంలో రన్ రాజా రన్, పెళ్లిచూపులు చిత్రాలకు అసిస్టెంట్‌గా వర్క్ చేశాను.
* సినిమాకు మంచి అప్లాజ్ వస్తోంది. ముఖ్యంగా సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు ప్రశంస నాలో ఉత్సాహాన్ని నింపింది. ‘ఇండస్ట్రీలో ఎవ్వరూ టచ్ చేయని కాస్ట్ పాయింట్‌తో విమర్శలకు దూరంగా లవ్ సోర్టీ చెప్పడం బావుంది’ అంటూ కితాబిచ్చాడు. ఇక -కానె్సప్ట్‌టూ మిత్రులు, హితులు, ఆడియన్స్ నుంచి మరంచి రెస్పాన్స్ వస్తోంది.
* దిల్‌రాజ్ సీన్‌లోకి రాకముందు వరకూ కథ వేరు. ఆయన సినిమా చూసి చేసిన కొన్ని సజెషన్స్ -కమర్షియల్‌గా హైలెట్ కావడానికి ఉపయోగపడింది. కొంచెం టైం తీసుకుంటే ఇంకా బాగా చేసేవాళ్లం కదా అని ఇప్పుడు అనిపిస్తోంది.
హీరోయిన్ గార్గేయి ఎల్లాప్రగడ మాట్లాడుతూ..
* హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తెలుగమ్మాయినే. తొమ్మిదేళ్ల వయసులోనే -అమ్మ సాయంతో ఆడియన్స్‌కు వెళ్లేదాన్ని. ఆ ఏజ్‌లోనే హృదయం అనే సీరియల్ చేశా. ఇంటర్‌కి వచ్చేసరికి -ఆర్టిస్ట్ కావాలన్న ఆకాంక్షతో ఆడియన్స్‌కు వెళ్తుండేదాన్ని. అలాంటి ప్రయత్నంలో క్రేజీ యాంట్స్ బ్యానర్‌లో చాన్స్ వచ్చింది.
* కాస్ట్‌మీద -ఊళ్లలో ఉన్నంత పట్టింపు సిటీలోనూ ఉంటుంది. కాకపోతే ఎగ్జిబిట్ కాదంతే. స్క్రిప్ట్ వింటున్నపుడు అలాంటి పాయింట్లు చెప్తుంటే ఎగ్జయిట్ అయ్యాను. రియల్ స్టోరీ కాకున్నా- రిలేటబిలిటీ ఉందనే ఒప్పుకున్నా.
* సినిమా చూసిన తరువాత మా ఫ్యామిలీయే ఆశ్చర్యపోయింది. ఇంత పెర్ఫార్మెన్స్ ఇస్తావనుకోలేదు అంటూ అభినందించారు. స్నేహితుల నుంచీ అదే రెస్పాన్స్. ఆడియన్స్ నుంచీ మంచి రెస్పాన్స్ వస్తుండటం -చాలా హ్యాపీగా ఉంది.
* పాత్రను అంత పెర్ఫెక్ట్‌గా చేయడానికి కారణం -దర్శకుడే. షూటింగ్‌కు ముందే కంటెంట్‌పై బాగా రిహార్సల్స్ చేశాం. పైగా -డైరెక్టర్‌కి కథపై క్లారిటీ ఉంది కనుక.. ఆయన చెప్పినట్టు చేయగలిగాను. అదే నాకు ప్లస్సైంది.