ఓ క్లీన్ లవ్ స్టోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెలుగులో క్లీన్ లవ్ స్టోరీ వచ్చి చాలా కాలమైంది. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకూ కుటుంబ సమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో సినిమా చూసేలాంటి కథ ఇది. వైవిథ్యంగా సాగే ఈ కథ కడుపునింపే
ఫుల్‌మీల్స్ లాంటిది. -మళ్లీ మళ్లీ.. చూడొచ్చు
యాక్టింగ్ మీద ఫ్యాషన్‌తో -మళ్లీ మళ్లీ చూశా చేశా. హీరోగా నిలబడగలనన్న నమ్మకమైతే ఉంది. కెరీర్‌పరంగా ఎంత ప్లస్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు -అంటున్నాడు అనురాగ్ కొణిదెన. క్రిషి క్రియేషన్స్ పతాకంపై అనురాగ్ కొణిదెన హీరోగా హేమంత్ కార్తీక్ తెరకెక్కిస్తోన్న చిత్రం -మళ్లీ మళ్లీ చూశా. కె కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రంలో శే్వత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు. అక్టోబర్ 18న సినిమా విడుదలవుతున్న సందర్భంలో హీరో అనురాగ్ మీడియాతో మాట్లాడారు.
క్లాస్, మాస్ రెండు వేరియేషన్స్ పాత్ర చేశా. హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్న కాలేజీ కుర్రాడు -కెరీర్‌ని నిర్లక్ష్యం చేస్తూ మాస్‌లా ఎందుకు తిరుగుతున్నాడు? అన్న ప్రశ్నకు సమాధానమే సినిమా.
మాది కన్‌స్ట్రక్షన్ బిజినెస్. ఫాదర్‌కి హెల్ప్‌గా ఉంటూనే -యాక్టింగ్ ఇంట్రెస్ట్‌ని చెప్పా. ప్రోత్సహించటంతో ఇలా వచ్చా.
వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. ఓ కాలేజ్ కుర్రాడికి దొరికిన డైరీ -అతని లైఫ్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ డైరీ రాసిన అమ్మాయి దొరికితే లైఫ్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందన్న ఆలోచనతో హైదరాబాద్ వస్తాను. తరువాత ఏం జరిగిందో సినిమాలో చూడొచ్చు.
సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. రెండో అమ్మాయి ఎలా ఎంటరైంది. నిజంగానే కలిశాడా? ఎలా.. ఇదంతా సినిమాలో ట్విస్ట్.
అలాగని ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాదు. బోల్డ్ కంటెంట్ అస్సలుండదు. వెరీ క్లీన్. చిన్నపిల్లలు సైతం సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.
దర్శకుడు హేమంత్‌తో పరిచయం ఇదే. నేను కథలు వింటున్న టైంలో కలిశాడు హేమంత్ చెప్పిన కథ నచ్చింది. మా ప్రొడక్షన్‌లోనే చేశాం.
సొంత ప్రొడక్షన్‌లో సినిమా చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అనుకున్నంత సులువు కాదన్న కొత్తపాఠాలు ఆరంభంలోనే నేర్చుకున్నట్టనిపిస్తుంది. హీరో, ప్రొడక్షన్ బ్యాలెన్స్ చేయడం కష్టమే. భవిష్యత్‌లో మరో ప్రొడక్షన్ హౌస్‌తో సినిమా చేయాల్సి వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలన్న పాఠమూ ఇక్కడే తెలిసొచ్చింది.
ఆర్టిస్టుగా ఇన్‌స్పిరేషన్ ఎవ్వరూ లేరుగానీ, హీరో వెంకటేష్ పెర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. ఇక తరువాతి ప్రాజెక్టు -మార్చిలో ఉండొచ్చు. సొంత ప్రొడక్షనా? వేరే నిర్మాతతోనా అన్నది ఈ సినిమా డిసైడ్ చేస్తుందేమో.