రాగల 24 గంటల్లో.. హిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రధారులుగా నటించిన చిత్రం -రాగల 24 గంటల్లో. ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు ఈ సినిమా నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా షూటింగ్ పూరె్తైంది. నవంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా సినిమా ప్రమోషనల్ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -టీజర్, ట్రైలర్ బావుంది. సినిమా ప్రమోషన్ అందరి బాధ్యత. అది నిర్మాతలకు హెల్ప్ అవుతుంది. శ్రీనివాస్‌రెడ్డికి ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇవ్వడం ఖాయమని ఆకాంక్షించారు. దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ -ప్రమోషనల్ సాంగ్ చేయడానికి ఇనిస్పిరేషన్ దేవిశ్రీప్రసాద్. అడగానే సాంగ్ లాంచ్ చేసినందుకు థాంక్స్. అందరూ గర్వపడేలా సినిమా చేశాం అన్నారు. నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ -నా మొదటి సినిమా ఇది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ని నమ్మి చేశాను. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. నవంబర్‌లో మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు. సినిమా సంగీత దర్శకుడు రఘు కుంచె తదితరులు మాట్లాడారు.