సస్పెన్స్ థ్రిల్లర్ నేత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లతా సంగరాజు, గీతాసింగ్, భద్రం, కేదార్ శంకర్ ప్రధాన తారాగణంగా బివిఎస్‌ఆర్ క్రియేషన్స్, మీజా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై హుసేన్ దర్శకత్వంలో బివి సుబ్బారెడ్డి రూపొందిస్తున్న చిత్రం నేత్ర. సినిమాకు సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి సెన్సార్‌కు పంపనున్నారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు మా అధ్యక్షుడు నరేష్, శివబాలాజీ సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- సస్పెన్స్ థ్రిల్లర్‌గా నేత్రా రూపొందిందని, సినిమాకు పేరుతోనే మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలిపారు. సినిమాలో ప్రతి పాత్ర వైవిధంగా వుంటుందని, అలాగే ప్రాధాన్యత కూడా కథనంతో కలిసి వుంటుందని అన్నారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని నిర్మాత అన్నారు. చిత్రానికి కెమెరా రఘునాథన్, సంగీతాన్ని రాజ్‌కిరణ్ అందించారు.