ఉన్నట్టా.. లేనట్టా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్ బాహుబలి చిత్రాల్లో సౌత్‌లోనే ఓ సెనే్సషన్ -కేజీఎఫ్ చాఫ్టర్ 1. రాకింగ్ స్టార్ యశ్‌కి ఎంత గుర్తింపు తెచ్చిందో యాక్షన్ డైరెక్టర్‌గా ప్రశాంత్ నీల్‌కీ అంతే గుర్తింపునిచ్చిన సినిమా అది. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లు వసూళ్లు సాధించి.. ప్రశాంత్ నీల్‌కి మంచి డిమాండ్ క్రియేట్ చేసింది. ఈ దర్శకుడితో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఓ సినిమా ఉంటుందన్నది కొంతకాలంగా వినిపిస్తోన్న మాట. ఆ ప్రాజెక్టులో ఎన్టీఆర్ హీరో అన్న కథనాలూ వినిపించాయి. ఏ క్షణంలోనైనా అధికారిక ప్రకటన వెలువడొచ్చని అనుకుంటున్న టైంలో -మహేష్‌బాబుతో ప్రశాంత్ నీల్ సినిమా ఉండొచ్చంటూ కొత్త స్క్రిప్ట్ తెరపైకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లోనే ఉండొచ్చంటూ కథనాలు రావడంతో.. మరి ఎన్టీఆర్ ప్రాజెక్టు? అన్న డౌట్లు వచ్చాయి. అటుతిరిగి ఇటుతిరిగి మళ్లీ ఇప్పుడు మైత్రీపై ప్రశాంత్-ఎన్టీఆర్ ప్రాజెక్టేనంటూ కథనాలు వినిపించాయి. ఈ కథనాలకు బలం చేకూరుస్తూ -ఓ సెనే్సషన్ అనౌన్స్‌మెంట్ ఇస్తున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించటంతో.. ఇదే ప్రాజెక్టు అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే మైత్రి మాత్రం -మత్తు వదలరా అంటూ ఓ చిన్న సినిమా అనౌన్స్‌మెంట్ ఇవ్వటంతో కన్ఫ్యూజన్ మొదలైంది. అసలు దర్శకుడు ప్రశాంత్‌తో మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్టు చేస్తుందా? కథనాలేనా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఏదేమైనా కెజిఎఫ్ చాప్టర్ 2తో బిజీగావున్న ప్రశాంత్ -ఆ ప్రాజెక్టు పూర్తి చేసి టాలీవుడ్‌కు రావడమనేది వచ్చే ఏడాదిలోనే ఉండొచ్చు. మాఫియాని పీక్స్‌లో చూపించబోతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 ఫలితాన్ని బట్టి -ప్రాజెక్టు ఉండేది లేనిదీ తెలుస్తుందని కొందరంటున్నారు. అధికారిక ప్రకటన వచ్చేవరకూ.. ఇవన్నీ ‘ట’గానే ఉంటాయన్నది నిజం.