చలో..అజర్‌బైజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో కార్తికేయ తాజా చిత్రం 90ఎంఎల్ చిత్రంకోసం హీరో, హీరోయిన్ నేహా సోలంకి కలిసి అజర్‌బైజాన్‌కు వెళ్లనున్నారు. ఇనిపించుకోరు ఇనిపించుకోరు అనే తాజాగా వినిపిస్తున్న ఓ పాటకు సంబంధించిన షూటింగ్ అక్కడ జరగనుంది. ఇటీవలే విడుదలైన పాట కుర్రకారులో హల్‌చల్ చేస్తోంది. అమ్మాయిల ప్రవర్తనతో విసిగిపోయిన అబ్బాయిలు, ఈ పాటను పాడుతున్నట్లుగా ఉంటుంది. చంద్రబోస్ పాటకు అనూప్ రూబెన్స్ బాణీకట్టారు. ఆర్‌ఎక్స్ 100 వంటి చిత్రాన్ని తీసిన అశోక్ రెడ్డి గుమ్మకొండ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జానీ మాస్టర్ ఆధ్వర్యంలో హీరోతోపాటు 50 మంది డాన్సర్లపై కోకాపేటలో వేసిన సెట్‌లోనాలుగు రోజులపాటు పాటను చిత్రీకరించాం. కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు దేవదాస్. ఎంబిఏ గోల్డ్ మెడలిస్ట్. అంతటి విద్యావంతుడు ఆథరైజ్డ్ డ్రింకర్‌గా ఎందుకు మారాడన్న అంశం చుట్టే ఈ కథ తిరుగుతుంది. యూత్‌కు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని దర్శకుడు శేఖర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే విడుదలై టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, ఈ పాటకు తగిన విధంగానే అబ్బాయిలు కనెక్ట్ అయ్యారని, సినిమా కథనంపై కూడా తమకు నమ్మకం ఉందని నిర్మాత అశోక్‌రెడ్డి అన్నారు. టాకీపార్ట్ పూర్తయిన ఈ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ కోసం అజర్‌బైజన్ రాజధాని బాకూ వెళుతున్నాం అని అన్నారు. గ్యాంగ్‌లీడర్‌లో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ, ఈ చిత్రంలో మోడరన్ దేవదాసుగా ప్రేక్షకులను అలరించనున్నారన్నారు. రావురమేష్, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.