అదే మాకు పబ్లిసిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తి హీరోగా డ్రీమ్ వారియర్స్ బ్యానర్‌పై లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం -ఖైదీ. ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మాతలు. ఈ సినిమాను తెలుగులో శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కెకె రాధామోహన్ సమర్పిస్తున్నాడు. అక్టోబర్ 25న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో హీరో కార్తి మాట్లాడుతూ -నటుడిగా ప్రయోగాలు చేయడానికి అవకాశమిచ్చిన ఖాకీ చిత్రాన్ని ఆదరించారు. అలాంటి మరొక రా సినిమా ఖైదీ. కొత్త ఐడియా.. చిన్న లైన్ చెప్తానంటూ కథ మొదలెట్టారు. కథ విన్నపుడు ఇదొక హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ అనిపించింది. అందుకే వెంటనే ఓకే చేసేశాను. సినిమాలో హీరోయిన్ లేదు. పాటలుండవు. కామెడీ ట్రాక్ కూడా లేదు. అదే ఖైదీ చిత్రానికి పెద్ద పబ్లిసిటీ. సినిమా ప్రజెంట్ చేసిన విధానం బావుంది. అక్టోబర్ 25న సినిమాను ఎంజాయ్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి అన్నాడు. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ -తమిళంతోపాటు తెలుగులోనూ పాపులర్ అయిన హీరో కార్తి. ఇప్పటికే తెలుగులో ఖైదీ పేరిట వచ్చిన చిత్రాలు చాలావరకూ హిట్టయ్యాయి. ఈ ఖైదీ కూడా హిట్టుకొడుతాడని ఆకాంక్షిస్తున్నా అన్నారు. తెలుగు వర్షన్ సమర్పకుడు రాధామోహన్ మాట్లాడుతూ -ప్రస్తుతం సినిమాల్లో ఎలాంటి ఛేంజెస్ కోరుకుంటున్నారో.. వాటికి అచ్చమైన ప్రతీక ఖైదీ. రొమాన్స్, సాంగ్స్ లేకుండా కేవలం ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో రెండు గంటలు ఆడియన్స్‌ని కట్టిపడేసే సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. హీరో అడవి శేష్ మాట్లాడుతూ -కార్తి చేసిన ఆవారా చిత్రాన్ని బ్లాక్‌లో టికెట్ కొని చూశాను. ఖైదీ ట్రైలర్ నచ్చి ట్వీట్ చేయడం, ఇక్కడికి రావడం జరిగింది. నేను కార్తి చిత్రాలకు ఫ్యాన్‌ని. 25న థియేటర్‌లో సినిమా చూసి ఫీడ్‌బ్యాక్ ఇస్తా అన్నారు. ఖైదీ చిత్రానికి సంగీతం సామ్ సి ఎస్, సినిమాటోగ్రఫీ సత్యన్ సూర్యన్ సమకూరుస్తున్నారు.