బాజీరావ్ మస్తానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరాఠా యోధుడు పేష్వి బాజీరావ్ జీవితచరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రం ప్రమోషన్‌కోసం
న్యూయార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నటి ప్రియాంకచోప్రా పాల్గొని సందడి చేసింది. అమెరికా టీవీ సీరియల్ ‘క్వాంటికొ’ షూటింగ్‌కోసం వెళ్లిన ఆమె మనదేశంలో జరిగిన బాజీరావ్ మస్తానీ ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొనలేకపోయింది. చివరకు న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆ చిత్రంలో తన పాత్రగురించి వివరించింది. నలుపు, బంగారువర్ణంతో మిలమిలలాడే చీరతో ఆమె హొయలుపోయింది. సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన
ఈ చిత్రం ఈనెల 18న విడుదల కానుంది. బాజీరావ్‌గా రణవీర్‌సింగ్, అతడి మొదటి భార్య కాశీబాయిగా ప్రియాంకచోప్రా, రెండవ భార్య మస్తానీగా దీపిక పదుకొనే నటిస్తున్న విషయం తెలిసిందే.