లెవెన్త్ అవర్‌లో రంగమార్తాండ కథ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ రచయితా దర్శకుడైనా కథను ఎన్నిరకాలుగా చెప్పొచ్చో.. కథనాన్ని ఎన్ని విధాలుగా తిప్పొచ్చో ఆలోచనలు చేశాకే సినిమా చేస్తాడు. మంచి సినిమా అనుకునే అంతా చేస్తాం. అది మంచిదో కాదో నిర్ణయించేది మాత్రం ప్రేక్షకుడే -అన్నది మూడొందల చిత్రాలకు పైగా రచయితగా పనిచేసిన పరుచూరి బ్రదర్స్ చెప్పే మాట. కొత్తనీరొచ్చినపుడు పాతనీరు పక్కకు జరగక తప్పుకున్నట్టే.. ప్రస్తుతానికి ఈ దిగ్గజద్వయం కూడా అనుభవాలను పంచుతూ జర్నీ చేస్తున్నారు. అయితే, ఒకప్పటి వాళ్లతరం నటులు, దర్శకులు, రచయితలు.. కథాచర్చలకో, కథనంపై సలహాల కోసమో కలుస్తుండటం చూస్తూనే ఉన్నాం. చిరంజీవి మెగాస్టార్ కావడం వెనుక -పరుచూరి బ్రదర్స్ కథాబలం లేదని చెప్పలేం. అందుకే -చిరంజీవి ఆ రచయితలను మర్చిపోలేదు. చిరు సినిమాలో ఇంకా వాళ్ల పాత్ర వాళ్లు పోషిస్తూనే ఉన్నారు. ఆమధ్య రామ్‌చరణ్ హీరోగా చేసిన ‘రచ్చ’లో పరుచూరి బ్రదర్స్‌ని భాగం చేస్తే.. తాజాగా రామ్‌చరణ్ నిర్మాతగా చేసిన ‘సైరా’కు కథను తీసుకున్నారు. తన సినిమాలకు దర్శక, రచయితలు ఎవరైనా -చిరు మాత్రం పరుచూరి సలహాలు తీసుకుంటారనటంలో సందేహాలే అక్కర్లేదు. పరుచూరి సోదరుల్ని అంతగానూ నమ్మే దర్శకుడు -కృష్ణవంశీ. తను చేసిన కొన్ని చిత్రాలకు రచనా సహకారం అందించిన పరుచూరి బ్రదర్స్ సలహా తీసుకోకుండా స్క్రిప్ట్‌ను ఫైనల్ చేయరన్న అభిప్రాయాలైతే ఉన్నాయి. స్క్రిప్ట్‌లో లెవెన్త్ అవర్ మార్పులు చేర్పుల్ని స్వీకరించే కృష్ణవంశీ -తాజా ప్రాజెక్టు రంగమార్తాండకూ వారి సలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎన్నో రీమేక్ మూవీలను తెలుగు నేటివిటీకి తీసుకురావడమే కాదు, కథను తగిన విధంగా బలోపేతం చేసిన అనుభవమున్న పరుచూరి బ్రదర్స్ -రంగమార్తాండకు తమ అనుభవాన్ని రంగరిస్తారన్న టాక్ వినిపిస్తోంది.