రాగల.. సక్సెస్ మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యదేవ్, ఈషారెబ్బా, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రలుగా దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం -రాగల 24 గంటల్లో. శ్రీనివాస్ కానూరు నిర్మిస్తోన్న చిత్రం నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో -చిత్రంలో హీరోయిన్ ఇంట్రో సాంగ్ ‘నారాయణతే నమో నమో’ లిరికల్ వీడియోని తితిదే బోర్డ్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేతులమీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ -వెంటేశ్వర స్వామి కీర్తనగా సినిమాలో వినిపించే పాట విడుదల చేయడం ఆనందంగా ఉంది. మంచి విజువల్స్‌తో పాటను చిత్రీకరించారు. పాట హిట్టవుతుంది. సినిమా రెండింతలు హిట్టవుతుంది అన్నారు. నటుడు, మాటల రచయిత కృష్ణ్భగవాన్ మాట్లాడుతూ -సినిమాకు అన్నీ కలిసొస్తున్నాయి. అంచనాలను మించి అవుట్‌పుట్ రావడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ -దిల్‌రాజు ఇన్‌స్పిరేషన్‌తో ఇండస్ట్రీకి వచ్చానని, మిత్రుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో సినిమా నిర్మించటం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ -తితిదే చైర్మన్ సుబ్బారెడ్డి సినిమాలోని పాటను లాంచ్ చేయడం వెంకటేశ్వరుడి ఆశీర్వాదంగానే భావిస్తున్నాం. అంతేకాదు యస్వీబీసీ బోర్డ్ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలూ అప్పగించారు. నామీది నమ్మకానికి నిజాయితీగా పనిచేసి మంచి పేరు తెస్తానని అనాన్నారు కార్యక్రమంలో కమెడియన్లు రఘుబాబు, ఆలీ తదితరులు మాట్లాడారు. సినిమాకి సంగీతం రఘు కుంచె, సినిమాటోగ్రఫీ గరుడవేగ అంజి సమకూరుస్తున్నారు.