మహిళల కోసమే విజిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ నటుడు విజయ్ ద్విపాత్రాభినయంతో అట్లీ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు తెలుగులో అందిస్తున్న చిత్రం ‘విజిల్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 25న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలు తెలిపారు. ముందుగా నటి వర్ష మాట్లాడుతూ- తాను ఈ చిత్రంలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటించానని, ఈ సినిమాలో విజయ్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎంత పెద్ద హీరో అయినా విజయ్‌కు సినిమాపై వున్న అంకితభావం ఎంతో నచ్చిందన్నారు. సినిమా రూపొందించిన నిర్మాతలకు, దర్శకుడు అట్లీకి, హీరో విజయ్‌కి అభినందనలు తెలియజేస్తున్నానని, ఓ మంచి చిత్రంలో నటించిన ఆనందంలో తానున్నానని నటుడు కధీర్ తెలిపారు. నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ- తమిళంలో బ్రిగిల్‌కు ఎంత క్రేజ్ వుందో, తెలుగులో విజిల్‌కు అంతే క్రేజ్ వుందని, తమిళ సినిమాలా కాకుండా కంటెంట్ సరికొత్తగా చెబుతూ, అచ్చమైన తెలుగు సినిమాకా ఈ చిత్రాన్ని రూపొందించామని అన్నారు. కమర్షియల్‌గా బెస్ట్ మూవీగా ఈ సినిమా నిలబడుతుందని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు హై డ్రామాగా ఈ చిత్రాన్ని ఓ రైటర్‌గా, డైరెక్టర్‌గా ఆయన రూపొందించారని అన్నారు. తెలుగులో ఎప్పటినుంచో మంచి చిత్రాన్ని చేయాలనుకుంటున్న తనకు విజిల్ ద్వారా ఆ కోరిక తీరిందని, తమిళంలోకన్నా తెలుగులోనూ విజయవంతం అవుతుందని దర్శకుడు అట్లీ అన్నారు. నిర్మాత అఘోరామ్‌కు తాను ఋణపడి వుంటానని, దాదాపు 700 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేస్తున్నారని, యాక్షన్, డ్రామాతో స్పోర్ట్స్ ఎలిమెంట్‌తో ఈ చిత్రం ఎమోషన్లకు క్యారీ చేస్తుందని, ముఖ్యంగా సాధికారతను సందేశంగా ఇస్తుందని, అందుకే ఈ చిత్రాన్ని మహిళలకు అంకితం ఇస్తున్నానని ఆయన అన్నారు. ప్రస్తుత సమాజంలో జరిగే ఎన్నో అకృత్యాలు చూసి బాధతో ఈ కథను రాసుకున్నానని, ప్రతి మహిళ, పురుషుడు తప్పక ఈ చిత్రాన్ని చూడాలని, సమాజానికి ఓ సందేశంగా ఈ చిత్రాన్ని తాను రూపొందించానని ఆయన అన్నారు. ఫుట్‌బాల్‌కు మనదేశంలో పెద్దగా ఆదరణ లేకపోయినా ఈ చిత్రాన్ని చూశాక ప్రేక్షకులు ఆ ఆటపై మక్కువ పెంచుకుంటారని ఆయన వివరించారు.