ప్రతీకార కథతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కేరాఫ్ కంచరపాలెం’తో చిన్న సినిమాకు దన్నునిచ్చాడు దర్శకుడు వెంకటేష్ మహా. కథ, కథనాలు బలంగావుంటే సక్సెస్ అసాధ్యమేమీ కాదన్న నమ్మకం కలిగించాడు. దర్శకుడిగా తనను తను ప్రూవ్ చేసుకున్నాడు కూడా. వాస్తవానికి దగ్గరగావుండే కథను అల్లుకుని.. సహజత్వానికి దగ్గరైన పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచాడు. విమర్శకుల నుంచీ మహా ప్రశంసలే అందాయి అతనికి. కేరాఫ్ కంచరపాలెం తరువాత వెంకటేష్ వెంటనే మరో సినిమా చేసేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఫస్ట్ సక్సెస్‌ను నిలబెట్టుకోడానికి -మరో మంచి కథనే ఎంచుకుని వస్తాడనే ఇండస్ట్రీ భావించింది. అనుకున్నట్టే వెంకటేష్ మహా కాస్త ఆలస్యంగానే మరో సినిమాతో వస్తున్నాడట. స్ట్రెయిట్ సినిమా కాకుండా, సక్సెస్ సాధించిన మలయాళ సినిమా రీమేక్ చేస్తున్నట్టు సమాచారం. మలయాళ దర్శకుడు దిలీప్ పోతన్ తెరకెక్కించిన -మహేషింటే ప్రతీకారం సినిమా అక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్టైంది. ఓ వూళ్లో తలెత్తిన సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ఓ ఫొటోగ్రాఫర్ తన్నులుతింటాడు. ఆ సంఘటనతో అవమానానికి గురైన ఆ ఫొటోగ్రాఫర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే కథ. 2016లో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించటమే కాదు, జాతీయ అవార్డునూ సొంతం చేసుకుంది. ఆ సినిమాను తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు వెంకటేష్ రెడీ చేస్తున్నాడట. సత్యదేవ్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా వచ్చే నెలతో షూటింగ్ పూర్తి చేసుకోనున్నట్టు సమాచారం.